ఒకే రన్ వేపై రెండు విమానాలు: మీటర్ల దూరంలో తప్పిన పెను ముప్పు (వీడియో)

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా.. అదే రన్ వేపై ఎయిర్ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ టేకాఫ్ అవుతోంది. ఈ రెండింటికీ కేవలం వందల మీటర్ల దూరమే ఉండటం గమనార్హం. తృటిలో ప్రమాదం తప్పడంతో రెండు విమానాల్లోని వందలాది మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రెండు విమానాలు ఒకే రన్ వేపై ప్రయాణిస్తున్నాయి. ఇండోర్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా.. అదే సమయంలో ఎయిర్ ఇండియా విమానం తిరువనంతపురం వెళ్లేందుకు ఆకాశంలోకి ఎగిరింది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని విధుల నుంచి తప్పించింది.

Looks Scary Indigo flight landing in mumbai airport at the same time and runway Air India plane also tak off

ఈ ఘటనపై ఇండిగో సంస్థ స్పందిస్తూ.. తమ పైలట్ ముంబ్ ఎయిర్ పోర్ట్ ఏటీసీ సూచనలను తూచా తప్పకుండా పాటించాడని తెలిపింది. జూన్ 8వ తేదీన ఇండిగో 6ఈ6053 విమానానికి ఏటీసీ నుంచి ల్యాండింగ్ క్లియరెన్స్ లభించింది. తమకు ప్రయాణికుల సురక్షితమే ముఖ్యం. ప్రొసిజర్ ప్రకారం ఈ ఘటనపై తాము రిపోర్టు చేశామని ఇండిగో వెల్లడించింది.

ఎయిర్ ఇండియా కూడా ఈ ఘటనపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఏఐ657 తిరువనంతపురం వెళ్లే విమానానికి ఏటీసీ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే బయల్దేరాం. ఈ క్రమంలో సూచనల ప్రకారం మా విమానం టేకాఫ్ అయ్యింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అసలు అధికారులు ఎలా క్లియరెన్స్ ఇచ్చారనేది తేలాల్సి ఉంది అని ఎయిర్ ఇండియా పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+