ఆర్నెళ్లలో ప్రేమ.. ఆపై 'నో వర్జినిటీ', 'కండోమ్ బెలూన్స్' హంగామా: హిందూ కాలేజ్ 'వాలెంటైన్' వేడుకలు

Subscribe to Oneindia Telugu
  Valentine's Day : Jacqueline as Damdami Mai, Ranveer Singh as Love Guru

  న్యూఢిల్లీ: ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా వాలెంటైన్స్ డే సాంప్రదాయాన్ని కొనసాగించబోతున్నారు ఢిల్లీలోని హిందూ కాలేజ్ స్టూడెంట్స్. ఎప్పటిలాగే ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీని 'దమ్‌దామి మాత'గా, అలాగే ఓ టాప్ హీరోను 'లవ్ గురు'గా ఎంచుకున్నారు. కాలేజీ ప్రాంగణంలో 'వర్జిన్ ట్రీ'గా పేరుగాంచిన ఒక చెట్టుకు ఈ ఇద్దరి ఫోటోల్ని తగిలించి వాలెంటైన్స్ డే హంగామా చేయనున్నారు.

  ఆర్నెళ్లలో ప్రేమ.. ఆపై 'వర్జినిటీ'..:

  ఆర్నెళ్లలో ప్రేమ.. ఆపై 'వర్జినిటీ'..:

  వాలెంటైన్స్ డే రోజు 'వర్జిన్ ట్రీ'ని ఆరాధించడం కాలేజీ ప్రారంభమైన నాటి నుంచి కొనసాగిస్తున్నామని ఇక్కడి విద్యార్థులు చెబుతున్నారు. ఫిబ్రవరి 14న 'వర్జిన్ ట్రీ' వద్ద పూజలు జరిపే విద్యార్థి, విద్యార్థినులు ఆ తర్వాత ఆర్నెళ్లలోనే ప్రేమలో పడుతారని, ఆపై సంవత్సరంలోగా తమ 'వర్జినిటీ' పోగొట్టుకుంటున్నారని చెబుతున్నారు.

  జాక్వెలిన్.. రణ్ వీర్..:

  జాక్వెలిన్.. రణ్ వీర్..:

  గతేడాది 'వర్జిన్ ట్రీ' వద్ద పూజల కోసం దమ్‌దామి మాతగా దిశా పటానీ పూజలు అందుకోగా.. ఈసారి హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పూజలు అందుకోబోతుంది. దమ్‌దామి మాత ఎంపిక కోసం కాలేజీలో ఓటింగ్ సైతం పెట్టగా.. నర్గీస్ ఫక్రీ, అదితిరావ్ జాక్వెలిన్‌ను షార్ట్ లిస్ట్ చేశారు.

  ఫైనల్‌గా అంతా కలిసి 'జాక్వెలిన్' ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక 'లవ్ గురు' కోసం బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను ఎన్నుకున్నారు. జాక్వెలిన్, రణ్ వీర్ సింగ్ ల ఫోటోలను 'వర్జిన్ ట్రీ'కి తగిలించి.. వాలెంటైన్స్ డే రోజు పూజలు నిర్వహించనున్నారు.

  'మిస్టర్ ఫ్రెషర్'తో పూజలు:

  'మిస్టర్ ఫ్రెషర్'తో పూజలు:

  ఆనవాయితీ ప్రకారం.. ఈ ఏడాది కూడా వాలెంటైన్స్ డే నాడు 'మిస్టర్ ఫ్రెషర్' పూజారి రూపంలో ధోతి ధరించి వస్తాడని, 'వర్జిన్ ట్రీ' వద్ద దమ్‌దామి మాతకు, లవ్ గురుకు పూజలు చేసి హారతి ఇస్తాడని విద్యార్థులు తెలిపారు.

  కండోమ్ వాటర్.. అదే ఆశీర్వాదం..:

  కండోమ్ వాటర్.. అదే ఆశీర్వాదం..:


  'వర్జిన్ ట్రీ' వద్ద పూజల సందర్భంగా జాక్వెలిన్, రణ్ వీర్ ఫోటోలను చెట్టుపై ఉంచడంతో పాటు, నీళ్లు నింపిన కండోమ్స్ బెలూన్స్ లాగా వేలాడదీస్తామని థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఒకరు చెప్పారు. ఆ కండోమ్స్ ను పగలగొట్టినప్పుడు ఎవరిపై అయితే ఆ పవిత్రమైన నీళ్లు పడుతాయో... ఆ అమ్మాయి లేదా అబ్బాయికి త్వరలోనే లవర్ దొరుకుతాడని చెబుతున్నారు.

  ముఖ్య అతిథిగా నలిని రంజన్:

  ముఖ్య అతిథిగా నలిని రంజన్:

  ఈసారి హిందూ కాలేజ్ వాలెంటైన్ వేడుకల కోసం ఇదే కాలేజీలో 1994నాటికి బ్యాచ్‌కి చెందిన ఫిలిం మేకర్ నలిని రంజన్ ముఖ్య అతిథిగా రానున్నారు. 'మై వర్జిన్ డైరీ' సినిమాకు గాను ఆమె అవార్డు కూడా అందుకున్న సంగతి తెలిసిందే. తను ఆ కథను తెరకెక్కించడానికి కాలేజీలో నిర్వహించే 'వర్జిన్ ట్రీ' వేడుకే కారణమని, కాలేజీకి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Hoping to find love and losing virginity, students of Hindu College will worship Jacqueline Fernandez as 'Damdami Mata' - Goddess of love - this year on Valentine's Day..

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి