ఆరు వేల మందికి చుక్కలు చూపించారు, లాటరీతో ఎంత వసూలు చేశారంటే ?
బెంగళూరు/విజయపుర: గోల్డ్ బిస్కట్, హైటెక్ కారు, రాయల్ ఎన్ పీల్డ్ బైక్‌తో సహా అనేక విలువైన వస్తువులు లాటరీలోచి వస్తాయని ప్రచారం చేశారు. దెబ్బకు లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశారు. ఇంకేముందీ లాటరీ డ్రా జరగాలి అన్నప్పుడు హైడ్రామా చేసి లాటరీ డ్రా రద్దు చేసి షాక్ ఇచ్చారు. లాటరీ డ్రా జరగకుండానే జెండా ఎత్తేశారు. నాలుగైదు తాలూకాల ప్రజలకు మోసం చేసిన లాటరీ నిర్వహకులు అసలు బండారం బయటపడింది.
కర్ణాటకలోని విజయపురం జిల్లాలో అతి పెద్ద లాటరీ గోల్ మాల్ వ్యవహారం వెలుగు చూసింది. బంపర్ లాటరీ నడిపినట్లు ప్రజలకు బంగారు బిస్కట్, రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్, లగ్జురి కారు, బైక్‌లు, ప్రిడ్జ్ ఆశ చూపిన ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు సుమారు ఆరు వేల మందికి టోపీ పెట్టారు. దేవరహిప్పరగియలోని మనియార్ ఎంటర్‌ప్రైసస్ నిర్వహకులు ప్రజలను మోసం చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ. 600 చొప్పున వసూలు చేసి ఇష్టం వచ్చినట్లు టికెట్ అమ్మేశారు.

సుమారు 6 వేల మంది నుంచి రూ. 30 లక్షల రూపాయల పైగా వసూలు చేసి మోసం చేశారు. దేవరహిప్పరగి, సిందగి, ముద్దేబిహాళ, బసన బాగేవాడి, ఇండి ఇలా ఐదారు తాలూకాల్లో మనియార్ కుటుంబ తమ లాటరీ టిక్కెట్ విక్రయించింది. అనంతరం ఆగష్టు 15న డ్రా జరగాల్సి ఉంది. తాలూకాలు, గ్రామాల నుండి వచ్చిన వేలాది మంది ప్రజలు గుమికూడారు. అయితే లక్కీ డ్రా మాత్రం జరగలేదు.

సుమారు 6 వేల మంది దేవునిహిప్పరగియ మనియార్ ఎంటర్‌ప్రైసస్ ఎదురుగా చేరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొంత మంది ప్రజలు చేతికి చిక్కిన విలువైన వస్తువులు ఎత్తుకుని అక్కడి నుంచి పరారైనారు, ప్రజలు తిరగబడటంతో లాటరీ రద్దు చేశామని లాటరీ నిర్వహకులు చెప్పారు. అయితే లాటరీ నిర్వహకులే వారి మనుషులతో ఇలా డ్రామాలు ఆడించారని ప్రజలు ఆరోపించారు. వేలాది మంది ప్రజలు దేవరహిప్పరగి పోలీస్ స్టేషన్ ఎదురుగా నిరసన వ్యక్తం చేసి ధర్నా నిర్వహించారు. కేసు నమోదు చేసిన పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా లాటరీ నిర్వహించిన వారి మీద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications