లాటరీ స్కాం: బెదిరింపులు, జైలులో గట్టి బందోబస్తు
బెంగళూరు: అక్రమ లాటరీ స్కాం కేసులో అరెస్టు అయిన కింగ్ పిన్ పారిరాజన్ కు ప్రాణహాని ఉందని వెలుగు చూడటంతో పరప్పన అగ్రహార జైలులో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వీవీఐపీలకు కల్పించే భద్రత కంటే ఎక్కువ మంది సిబ్బందిని బ్యారెక్ దగ్గర నియమించారు.
సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటి ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), కేఎస్ఆర్ పీ, స్థానిక పోలీసులు పారిరాజన్ ఉంటున్న బ్యారెక్ దగ్గర భదత్ర ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సీనియర్ పోలీసు అధికారులు అనుమతి లేనిదే జైలు సిబ్బంది సైతం పారిరాజన్ ను కలవడానికి వీలులేదు.
రూ.7,000 కోట్ల లాటరీ స్కాం కేసులో కింగ్ పిన్ పారిరాజన్ ను సీఐడి పోలీసు అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇదే కేసులో పారిరాజన్ తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో బెంగళూరు నగర జాయింట్ పోలీసు కమిషనర్ గా పని చేస్తున్న అలోక్ కుమార్ ను గత నెలలో సస్పెండ్ చేశారు.

పారిరాజన్ తో పలువురు పోలీసు అధికారులు సంబంధాలు పెట్టుకున్నారని వెలుగు చూసింది. ఇదే సందర్బంలో పారిరాజన్ కు మాఫియా డాన్ లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పోలీసు అధికారుల నుండి బెదిరింపులు వస్తున్నాయని వెలుగు చూసింది.
దర్యాప్తు చేస్తున్న సీఐడి అధికారులకు ఫోన్ లు చేసి మా పేర్లు బయటపెట్టరాదని కొందరు బెదిరిస్తున్నారని వెలుగు చూసింది. పారిరాజన్ ను వీవీఐపిలకు కేటాయించే బ్యారెక్ లో పెట్టారు. 24 గంటలు సాముధ బలగాలు భద్రత కల్పిస్తున్నారు.
పారిరాజన్ ఉన్న బ్యారెక్ లో దినపత్రికలు, టీవీ పెట్టారు. ఇంటి బోజనం అందిస్తున్నారు. పారిరాజన్ ను ఎవ్వరు కలవకుండ జాగ్రతలు తీసుకున్నారు. జైలులో ఉన్న నేరస్తులు పారిరాజన్ మీద దాడి చేసే అవకాశం ఉందని పోలీసు అధికారులు గుర్తించారు. పారిరాజన్ నోరు తెరిస్తే మా పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అని పలువురు పెద్దలు హడలిపోతున్నారు. ఈ కేసును సీబీఐ అధికారులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications