daughter: కూతురి కోసం ఏదో చేశాడు. బాయ్ ఫ్రెండ్ అన్న దెబ్బకు స్పాట్ లో ఏం జరిగిందటే ?
చెన్నై: పక్కాప్లాన్ తో పోలీసులకు చిక్కకుండా హత్యలు చెయ్యడం మనం సినిమాల్లోనే చూస్తుంటాము. అయితే ఇక్కడ హత్యకు చేసిన ప్లాన్ సినిమా స్కెచ్ లను మించిపోయింది. కారు వెళ్లిన యువకులు కేజీ చేపలు ఎంత ? అనే డైలాగ్ మాత్రమే చెప్పారు. ఎదుటి వాళ్లకు అదే వినపడింది, అంతే తరువాత సీన్ మొత్తం మారిపోయింది. చేపలు అమ్ముతున్న దంపతుల మీద కారులో వెళ్లిన యువకులు ఇష్టం వచ్చినట్లు నరికేశారు. కూతురి ప్రియుడిని దారుణంగా హత్య చేసిన వ్యాపారి అంతకంటే ఘోరంగా హత్యకు గురికావడం కలకలం రేపింది.

చెన్నైలో కలకలం
చెన్నై సిటీలోని వండలూరులోని తదుపరి మట్టి ఏరియాలో పార్థిబన్ (46), అతని భార్య జానకి (43) నివాసం ఉంటున్నారు. వండలూరు నగర్ లోని మెటు వీధిలో నివాసం ఉంటున్న పార్థీబన్, జానకీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పార్తీబన్ మరియు అతని భార్య జనకి ఇద్దరూ మన్నివాక్కంలోని ఒట్టేరి డిఎస్‌నగర్ ప్రాంతంలో చేపల దుకాణం నడుపుతున్నారు. చాపల దుకాణంలో ప్రతినెల లక్షల్లో డబ్బులు బాగా సంపాధిస్తున్న దంపతులు కుమార్తెలతో కలిసి సంతోంగా ఉండేవారు.

కారు వచ్చింది.... ప్రాణం పోయింది
ఈనెల 13వ తేదీన దంపతులు ఇద్దరూ చేపల వ్యాపారం చేస్తూ బిజీగా ఉన్నారు. అంతలో చేపల దుకాణం దగ్గర ఓ కారు అతివేగంతో వెళ్లి ఆగింది. కేజీ చేపలు ఎంత అంటూ ఓ యువుడు అడిగాడు. పార్థీబన్ నుంచి మాట వచ్చిన వెంటనే అకస్మాత్తుగా కారులో నుంచి వచ్చిన ఓ గ్యాంగ్ చేపలు అమ్ముతున్న పార్థీబన్‌ను వేటకోడవలితో నరికేశారు. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన పార్థీబన్ భార్య జానకీని కూడా ఆ ముఠా కత్తులతో తలపై నరికి కారులో అక్కడి నుంచి పరారయ్యాడు.

స్పాట్ లో చంపేశారు
ఈ విషయం తెలుసుకున్న ప్రజలు వెంటనే ఒట్టేరి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన జానకీని రక్షించి క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పార్థీబన్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పార్థీబన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య ఘటనకు సంబంధించి తాంబరం పోలీసు కమిషనర్ అమల్‌రాజ్ మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు.

కూతురు లవ్ స్టోరీతో ప్రియుడి హత్య
హత్యకు గురైన పార్తీబన్ కుమార్తె అతని ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న శరవణన్ కుమారుడు ప్రేమ్‌కుమార్‌ను ప్రేమిస్తోంది. ప్రేమ్‌కుమార్కు చాపల వ్యాపారి పార్థీబన్ కుమార్తెతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యింది. తరువాత ఇద్దరు స్నేహితులు అయ్యి ప్రేమించుకున్నారు, వియ తెలుసుకున్న పార్థీబన్ ఏడాది క్రితం ఆరంబాక్కం సమీపంలో తన కూతురు ప్రియుడు అయిన ప్రేమ్‌కుమార్‌ను దారుణంగా హత్య చేశాడు.

తమ్ముడి హత్యకు అన్న ప్రతీకారం
హత్యకు గురైన ప్రేమ్‌కుమార్ సోదరుడు ప్రశాంత్ తన తమ్ముడి హత్యకు పార్థీబన్, అతని కూతుళ్లు స్కెచ్ వేసినట్లు భావించాడు. అప్పటి నుంచి పార్థీబన్ హత్యకు ప్రశాంత్ స్కెచ్ వేశాడు. సంవత్సరం నుంచి తమ్ముడు ప్రేమ్ కుమార్ ను హత్య చేసిన పార్థీబన్ ను హత్య చెయ్యాలని ప్రయత్నిస్తున్న ప్రశాంత్ సాయంత్రం అతని స్నేహితులతో కలిసి కారులో వెళ్లి అనుకున్న పని పూర్తి చేశాడని పోలీసు అధికారులు తెలిపారు. ఈ హత్య కేసులో ప్రసాద్, అజయ్, దినేష్, ప్రవీణ్, ప్రదీప్, ధనుష్ కుమార్ అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications