లవ్ అఫైర్, రాజీకి నో: రెండు వర్గాల మధ్య ఉద్రిక్తం

సమాచారం మేరకు.. రెండు వేర్వేరు వర్గాలకు చెందిన యువతి, యువకులు ప్రేమించుకున్నారు. ఇది సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో ఘర్షణకు దారి తీసింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. యువతి తండ్రి సహా ఇరవై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు.
36 మంది పైన కేసు నమోదు చేశారు. 24 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో కత్తులు, కర్రలు, 12 బోర్ రైఫిల్ తదితరాలు ఉన్నాయని తెలుస్తోంది.
కాగా, యువతి, యువకుడి మధ్య లవ్ అఫైర్ వెలుగు చూసినప్పటి నుండి ఇరువర్గాల వారు గత కొద్ది రోజులుగా పరస్పరం దుర్భాషాలాడుకుంటున్నారని స్థానికులు చెప్పారని తెలుస్తోంది. కొందరు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే, యువతి తండ్రి అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది.
మహిళపై మద్యంపోసి నిప్పంటించిన దుండగుడు
సోమవారం తెల్లవారు జామున కేరళలో కన్నూర్-ఎర్నాకులం ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఒక ఖాళీ కంపార్ట్‌మెంట్‌లో ఓ మహిళపై ఒక వ్యక్తి మద్యం పోసి నిప్పంటించి పారిపోయిన విషయం తెలిసిందే. 40 శాతం కాలిన గాయాలతో ఆ మహిళ అరుస్తూ రైలు దిగి ప్లాట్‌ఫామ్‌పైకి పరిగెత్తుతూ వచ్చిందని, ఆ రైలు ఎక్కడానికి సిద్ధమవుతున్న ఇతర ప్రయాణికులు ఈ విషయం గమనించారని పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన జరగడానికి కొంతసేపటి ముందు ఫాతిమా, మరో పురుషుడు ప్లాట్‌ఫామ్‌పై గొడవపడ్డారని రైల్వే వర్గాలు తెలిపాయి. ఫాతిమాకు నిప్పంటించిన ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కోజికోడ్ జిల్లాకు చెందిన ఫాతిమాను తొలుత జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
అనంతరం మెరుగయిన వైద్యం కోసం కోజికోడ్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటన జరిగిన కంపార్ట్‌మెంట్‌ను తొలగించి రైలును పంపించినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ సంఘటన వల్ల రెండు సీట్లు కాలిపోయాయని ఆ వర్గాలు చెప్పాయి.
నాలుగేళ్ల క్రితం కేరళలో సౌమ్య అనే మహిళపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన విషయం తెలిసిందే. త్రిసూర్ జిల్లా వల్లతోల్‌నగర్ సమీపంలో 2011 ఫిబ్రవరి ఒకటో తేదీన కొచ్చిలో విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న సౌమ్యపై లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో అత్యాచారం చేసి, తరువాత నడుస్తున్న రైలులోంచి తోసేశారు.












Click it and Unblock the Notifications