• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీలో చేరిన హైకోర్టు మాజీ జడ్జీలు -ఎన్నికల కేరళలో సంచలనం -బ్రాహ్మణ రిజర్వేషన్, లవ్ జీహాద్ కారణాలు

|

మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గగోయ్ నెలకొల్పిన సంప్రదాయం న్యాయవర్గాల్లో వేగంగా విస్తరిస్తోంది. పవిత్రంగా భావించే న్యాయమూర్తి పదవి నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత మాజీలుగా మారిన మరో ఇద్దరు జడ్జిలు కాషాయదళంలో కలిసిపోయారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో సంచలనం రేపుతూ ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మాజీ జడ్జీలు బీజేపీలో చేరిపోయారు..

సహజీవనంలో సెక్స్.. రేప్ కాబోదు -తప్పుడు వివాహ వాగ్ధానం నేరమే -సుప్రీంకోర్టు మరో సంచలనం

కేరళ హైకోర్టులో జడ్జీలుగా పని చేసిన పీఎన్ రవీంద్రన్, వి చితంబరేష్‌లు మరో 18 మందితో కలిసి ఆదివారం కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేరళలోని ఎర్నాకులంలో కొనసాగుతున్న విజయయాత్ర ఇందుకు వేదికైంది. ఈ ఇద్దరు జడ్జీలతో పాటు మాజీ డీజీపీ వేణుగోపాల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ జనరల్ మేనేజర్ సోమచూదన్, మిలిటరీ మాజీ అధికారి (రేర్ అడ్మిరల్) బీఆర్ మీనన్‌లతో సహా మరికొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరారు.

‘Love jihad’ and ‘nationalism’ prompt two former high court judges in Kerala to join BJP

అయితే భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన చితంబరేష్‌.. ప్రత్యక్ష చేరికలో లేరు. ఢిల్లీలో ఉన్న ఆయన.. అక్కడి నుంచే సభ్యత్వం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా తాను విద్యార్థిగా ఉన్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. పలక్కడ్‌లోని విక్టోరియా కాలేజీలో బీజేపీకి చాలా కాలం మద్దతుదారుగా ఉన్నట్లు వెల్లడించారు. బీజీపీలో చేరిన ఇద్దరు జడ్జీలు.. కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చిన 'లవ్ జిహాదీ' బిల్లుకు మద్దతిచ్చారు.

‘Love jihad’ and ‘nationalism’ prompt two former high court judges in Kerala to join BJP

viral video:రాహుల్ గాంధీ పాటవం -బీజేపీ బేరాల భయం -విజయన్ వ్యంగ్యాస్త్రం

బ్రాహ్మణులకు రిజర్వేషన్లు, లవ్ జీహాద్, జాతీయవాదం అంశాలపై తొలి నుంచీ గొంతు వినిపిస్తోన్న మాజీ జడ్జిలు పీఎన్ రవీంద్రన్, వి చితంబరేష్‌.. రాజకీయాల్లో చేరికకు కూడా వాటినే కారణాలుగా పేర్కొనడం గమనార్హం. కేరళలో ఈసారి గట్టి ప్రయత్నాలు చేస్తోన్న బీజేపీ ఇప్పటికే మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలోకి చేర్చుకుంది. తాజా చేరికలతో ఊపుమిదున్న కేరళ కమల దళం ఎన్ని సీట్లు సాధిస్తుందో చూడాలి మరి.

English summary
ahead of kerala assembly elections 2021, Two former judges of the Kerala High Court, Justices (retd.) PN Ravindran and V Chitambaresh joined the BJP on Sunday during the party's Vijaya Yatra function at Thripunithara, Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X