Love marriage: కొత్త పెళ్లి కూతురు, భార్యను చంపేసి సైలెంట్ గా చెక్కేసిన భర్త, ఏం జరిగిందంటే !

బెంగళూరు/బెళగావి: ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని యవతి వెంట తిరిగిన యవకుడు ఆమెను వలలో వేసుకున్నాడు. కొంతకాలం ఎంజాయ్ చేసిన ప్రేమికులు కరోనా సెకండ్ వేవ్ ముందే సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. భార్యతో చక్కగా కాపురం చేస్తున్న భర్తకు ఎక్కడో అనుమానం మొదలైయ్యింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఎవ్వరికి డౌట్ రాకుండా సైలెంట్ గా చంపేసిన భర్త చాకచక్యంగా చెక్కేశాడు. ప్రేమించిన వ్యక్తితో జీవితాంతం సంతోషంగా జీవించాలని పెళ్లి చేసుకున్న యువతి లాక్ డౌన్ సమయంలో భర్త చేతిలో హత్యకు గురి కావడం కలకలం రేపింది.

ప్రేమపావురాలు

ప్రేమపావురాలు

కర్ణాటకలోని బెళగావి నగరంలోని బసవనగర్ లో జ్యోతి యల్లారి (19) అనే యువతి నివాసం ఉంటున్నది. బెళగావిలోని శహాపుర సమీపంలో లక్ష్మీకాంత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని జ్యోతి వెంట చాలా కాలం తిరిగిన లక్ష్మీకాంత్ చివరికి ఆమెను వలలో వేసుకున్నాడు.

కరోనా సెకండ్ వేవ్ ముందు పెళ్లి

కరోనా సెకండ్ వేవ్ ముందు పెళ్లి

కొంతకాలం లక్ష్మీకాంత్, జ్యోతి కలిసి సంతోషంగా అక్కడా ఇక్కడ తిరిగి ఎంజాయ్ చేశారు. పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా జీవించాలని లక్ష్మీకాంత్, జ్యోతి డిసైడ్ అయ్యారు. మూడు నెలల క్రితం కరోనా సెకండ్ వేవ్ మొదలు కాకముందే లక్ష్మీకాంత్, జ్యోతి పెళ్లి చేసుకుని శహాపుర సమీపంలోని చుచ్చండి ప్రాంతంలోని సొంత ఇంటిలో లక్ష్మీకాంత్ అతని భార్యతో కలిసి తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారు.

వారం ముందు కొత్త ఇంట్లో ?

వారం ముందు కొత్త ఇంట్లో ?

లక్ష్మీకాంత్ జ్యోతిని వివాహం చేసుకోవడం అతని కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని తెలిసింది. ఇదే విషయంలో జ్యోతికి, ఆమె భర్త లక్ష్మీకాంత్ తల్లిదండ్రులకు కొన్నిసార్లు గొడవ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. చివరికి కరోనా వైరస్ సందర్బంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలోనే బెళగావి నగరంలోని అళవణ్ ఏరియాలో అద్దె ఇల్లు తీసుకున్న జ్యోతి, లక్ష్మీకాంత్ అక్కడ కాపురం పెట్టారు.

 సైలెంట్ గా భార్యను చంపేసి భర్త పరార్

సైలెంట్ గా భార్యను చంపేసి భర్త పరార్

కొత్తగా కాపురం పెట్టిన లక్ష్మీకాంత్ కు ఎక్కడో ఏదో జరుగుతోందని అనుమానం మొదలైయ్యిందని తెలిసింది. ఇంట్లో భార్య జ్యోతితో అతని భర్త లక్ష్మీకాంత్ గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టాడు. రాత్రి సహనం కోల్పోయిన భర్త లక్ష్మీకాంత్ సైలెంట్ గా అతని భార్య జ్యోతి గొంతు నులిమి హత్య చేసి ఇంటి నుంచి చాకచక్యంగా తప్పించుకుని పరారైనాడు.

నవవధువు హత్యతో షాక్

నవవధువు హత్యతో షాక్


జ్యోతి నుంచి రెండు రోజులు అయినా ఫోన్ రాకపోవడంతో మరుసటి రోజు ఆమె కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. ఇంట్లో బెడ్ రూమ్ లో జ్యోతి శవమై కనిపించడం, భర్త లక్ష్మీకాంత్ కనపడకపోవడంతో వాళ్లకు అనుమానం మొదలైయ్యింది. తమ కుమార్తె జ్యోతిని ఆమె భర్త లక్ష్మీకాంత్ హత్య చేశాడని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ప్రేమ వివాహం జరిగి మూడు నెలల కూడా పూర్తి కాకముందే నవవధువు జ్యోతి హత్యకు గురి కావడం కలకలం రేపింది. భార్య జ్యోతిని చంపేసి పరారైన లక్ష్మీకాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+