Wife: లవ్ మ్యారేజ్, గర్బిణి, ప్రాణానికి ప్రాణం, అత్త, భర్త కరోనాకు బలి, భర్త ఫోటో పెట్టుకుని భార్య !
బెంగళూరు: లవ్ మ్యారేజ్ చేసుకున్న యువతి భర్తతో కలిసి సంతోషంగా కాపురం చేస్తోంది, భర్తకు వ్యాపారాలు చెయ్యడం, భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండటంతో వారి సంసారం సాఫీగా సాగిపోయింది. ఇదే సమయంలో కరోనా వైరస్ మహమ్మారి వారి జీవితాలకు చిదిమేసింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త, ఆమె తల్లి కరోనా వ్యాధితో ప్రాణాలు విడిచారు. భర్త చనిపోయిన మూడు రోజులకే భార్య జీవితంపై విరక్తి పెంచుకునింది. బెడ్ రూమ్ లో భర్త ఫోటోను ముందు పెట్టుకుని భార్య తాను గర్భిణి అనే విషయం మరిచిపోయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వారం రోజుల ముందే ఆమె భర్త తల్లి కూడా కరోనా వైరస్ కు బలి అయ్యింది.

తండ్రి ఉద్యోగం కూతురికి
బెంగళూరు సమీపంలోని కనకపురకు చెందిన శాంతమల్లప్ప అనే ఆయన బెస్కాం (KEB)లో ఉద్యోగం చేసేవాడు. సర్వీస్ లో ఉండగానే శాంతమల్లప్ప మరణించాడు. తండ్రి శాంతమల్లప్ప ఉద్యోగం ఆయన కుమార్తె నందిని (28)కి వచ్చింది. కేఈబీ శాఖలో నందిని అసిస్టెంట్ గా మంచి ఉద్యోగం చేస్తున్నది.

లవ్ మ్యారేజ్
మైసూరుకు చెందిన వ్యాపారవేత్త సతీష్ అనే యువకుడు, నందిని ప్రేమించుకున్నారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న సతీష్, నందిని రెండు సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న సతీష్, నందిని దంపతులు బెంగళూరులోని బసవేశ్వరన నగర్ లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం నందిని మూడు నెలల గర్బవతి.

వారం ముందు అత్త బలి
నందినికి ప్రభుత్వ ఉద్యోగం కావడంతో ఆమె భర్త సతీష్ తో కలిసి బెంగళూరులోని బసవేశ్వర నగర్ లో నివాసం ఉంటున్నది. సతీష్ తల్లి మాత్రం మైసూరులోనే ఉంటున్నది. నందిని తల్లి, చెల్లెలు బెంగళూరు శివార్లలోని కనకపురలో సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల సతీష్ తల్లికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సతీష్ తల్లి వారం రోజుల క్రితం కరోనా వైరస్ కాటుకు బలి అయ్యారు.

భర్త ప్రాణం తీసిన కరోనా
తల్లి కరోనా కాటుకు బలి కావడంతో సతీష్ కుమిలిపోయాడు. ఇదే సమయంలో సతీష్ కు కూడా కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. బెంగళూరులో ఉంటూనే సతీష్ చికిత్స చేయించుకుంటున్నారు. చికిత్స విఫలమై మూడు రోజుల క్రితం సతీష్ కూడా ప్రాణాలు వదిలేశాడు. వారం ముందు అత్త, మూడు రోజుల క్రితం భర్త సతీష్ చనిపోవడంతో నందిని షాక్ కు గురైయ్యింది.

భర్త ఫోటో ముందు పెట్టుకుని ఆత్మహత్య
భర్త సతీష్ చనిపోయాడు అనే ఆవేదనతో నందిని కుమిలిపోయింది. నందిని ఆమె తల్లి, సోదరి కనకపురకు పిలుచుకుని వెళ్లారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సతీష్ లేని జీవితం తనకు వద్దని నందిని డిసైడ్ అయ్యింది. మద్యాహ్నం 1 గంట సమయంలో తనకు రూమ్ లో పని ఉందని ఆమె తల్లి, సోదరికి చెప్పి బెడ్ రూమ్ లోకి వెళ్లిన నందిని భర్త సతీష్ ఫోటో ఎదురుగా పెట్టుకుని ఉరి వేసుకునింది. కరోనా వైరస్ తో అత్తా, భర్త చనిపోవడం, ఆవేదనతో భార్య ఆత్మహత్య చేసుకోవడంతో నందిని కుటంబంలో విషాదం నెలకొనింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications