లవ్ షాక్: భర్తను చంపి భార్య సూసైడ్, అందరికీ సుదీర్ఘ నోట్
బెంగళూరు: కర్నాటకలో ప్రేమ పెళ్లి విషాదాంతమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, భర్త తన తల్లిదండ్రుల ఒత్తిడితో మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని భావించి, భార్య తన భర్తను హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. మోసం చేసేవాళ్లకు ఇది తగిన గుణపాఠం అని సూసైడ్ నోట్లో రాసింది.
మైసూరు ప్రాంతంలోని సరస్వతిపురంలో ఈ డబుల్ మృతి సంచలనం సృష్టించింది. ఇంటిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన భార్య, భర్త మృతదేహాలు బయటపడ్డాయి. భార్య తన సూసైడ్ నోట్లో ఎందుకు మృతి చెందామో వివరించింది.
ఆమె చివరికి పాలవాడికి కూడా ఓ సూసైడ్ నోట్ రాసింది. ఇక నుండి తమకు పాల అవసరంరాదని పేర్కొంది. మృతుల పేర్లు సత్యనారాయణ(25), మనస్విని (23). వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఏడాదిన్నరగా సత్యనారాయణపురంలో ఉంటున్నారు.
బుధవారం సాయంత్రం సత్యనారాయణ తండ్రి తన తనయుడికి ఫోన్ చేశాడు. వారు ఎంతకూ ఫోన్ తీయలేదు. దీంతో అతను వారి ఇంటి యజమానికి ఫోన్ చేశారు. ఆమె వెళ్లి పిలిస్తే ఎవరు తలుపు తీయలేదు. దీంతో ఆమె పక్కింటి వారికి, పోలీసులకు సమాచారం అందించింది.
తలుపు తెరిచి చూస్తే సత్యనారాయణ(25)విగత జీవిగా పడి ఉన్నాడు. అతను డిప్లోమా హోల్డర్. ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యగం చేస్తున్నాడు. అతని కుడి భాగంలో, కన్ను పైన గాయాలు ఉన్నాయి. అతని తల పైన బలమైన గాయం కనిపించింది. మరో గదిలో మనస్విని(23) ఉరేసుకొని చనిపోయి ఉంది. ఆమె సూసైడ్ నోట్ రాసింది.

తమ పెళ్లైన రెండేళ్ల తర్వాత తన భర్త తమ ఇంటర్ కాస్ట్ మారేజ్ గురించి మాట్లాడుతున్నాడని పేర్కొంది. తనను వేధిస్తుండటంతో ఆత్మహత్య చేసుకుందామని భావించానని పేర్కొంది. కానీ, తాను మరణించే ముందు తన భర్తను చంపాలనుకున్నానని పేర్కొంది.
తాను ఇతనిని చంపకపోతే, ఇతను మరొకరిని పెళ్లి చేసుకొని హాయిగా జీవిస్తాడని, తన ఆత్మహత్య వృధా కావొద్దనేదే తన ఉద్దేశ్యమని అందుకే అతనిని చంపాలనుకున్నానని రాసింది. తన తల్లిదండ్రులను మోసం చేసే వారందరికీ ఇది ఓ గుణపాఠం అని పేర్కొంది.
ఆమె తన ఇంటి యజమాని భార్యకు, సోదరికి కూడా సూసైడ్ నోట్ రాసింది. ఇంటి ఓనరు భార్యను ఆంటీ అని పిలిచేది. దీంతో ఆమెను ఆంటీ అంటూ సంబోధించింది.
పోలీసులు విగతజీవుడిగా కనిపించిన సత్యనారాయణ వద్ద గొడ్డలి, మరో ఆయుధం గుర్తించారు. ఆమె తన భర్త పడుకొని ఉన్న సమయంలో మొదట గొడ్డలితో అతని తల పైన బలంగా బాది ఉంటుందని, అతను చనిపోయాడని నిర్ధారించుకున్నాక మరో గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు.
కాగా, సత్యనారాయణ నాయక్ కమ్యూనిటికీ చెందిన వ్యక్తి. అతను మనస్వినితో ప్రేమలో పడ్డాడు. ఈమె కమ్యూనిటీ వొక్కలింగ. సత్యనారాయణ తండ్రి కుషాల్ నగర్‌లోని పాలిటెక్నిక్‌లో రిజిస్ట్రార్. మనస్విని తండ్రి ఉపాధ్యాయుడు. మనస్విని, సత్యనారాయణలు విద్యార్థులుగా ఉన్నప్పుడు ఇరువురు కలుసుకున్నారు.
ప్రేమించుకున్న వారు, పదిహేను నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే, వారి తల్లిదండ్రులను వీరు సంప్రదించలేదు. పెళ్లి అనంతరం వారు సరస్వతిపురంకు షిఫ్ట్ అయ్యారు. అక్కడ గదిని ఇల్లును తీసుకున్నారు.
సరస్వతిపురం వచ్చాక సత్యనారాయణ ఓ ఉద్యోగం చూసుకున్నాడు. మనస్వినికి ఉద్యోగం చేయలేదు. ఇది వీరిద్దరి మధ్య నిత్యం వాగ్వాదానికి దారి తీసేది.
ఆత్మహత్యకు రెండ వారాల ముందు మనస్విని మహిళా పోలీసు స్టేషన్లో తన అత్తమామల పైన ఫిర్యాదు చేసింది. తన నుండి తన భర్తను దూరం చేసేందుకు తన అత్తామామలు ప్రయత్నిస్తున్నారని, అంతేకాకుండా అతనికి వారి కమ్యూనిటికీ చెందిన మరో యువతితో పెళ్లి చేయాలని చూస్తున్నారని పేర్కొంది.
మనస్విని ఫిర్యాదుకు ముందే సత్యనారాయణ తన భార్య పైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య తనను వేధిస్తుందని ఫిర్యాదు చేశాడు. అనంతరం ఇరువురిని పోలీసులు కౌన్సెలింగ్ చేశారు. కౌన్సెలింగ్ తర్వాత కూడా వారి మధ్య గొడవలు తగ్గలేదు. మంగళవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
తన ఇంటి యజమానురాలికి రాసిన సూసైడ్ నోట్లో మనస్విని క్షమాపణలు కోరింది. మీ ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటున్నందుకు సారీ అని పేర్కొంది. తాను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నానో తెలిపింది. తన తల్లిదండ్రులకు తెలియకుండా తన శవాన్ని కాల్చివేయాలని కోరింది.
తాను ఇలా ఆత్మహత్య చేసుకున్నందుకు ఈ ఇంట్లోకి ఎవరు రారని తనకు తెలుసునని, కానీ తనకు మరో అవకాశం లేదని రాసింది. తాను సత్యనారాయణను అతని డబ్బుల కోసం పెళ్లి చేసుకోలేదని రాసింది. అతను తనను మోసం చేయాలని చూశాడని రాసింది.
అందుకే చంపాశానని, తన పైన ఉంచిన మీరు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయానని యజమానురాలికి రాసిన లేఖలో పేర్కొంది. తన సోదరికి రాసిన లేఖలో తన కుటుంబం తనను క్షమించాలని కోరింది. సత్యనారాయణను పెళ్లి చేసుకున్నందుకు తనను క్షమించాలని పేర్కొంది.












Click it and Unblock the Notifications