Car: కారు సన్ రూఫ్ లో జంట రొమాన్స్, చల్లగాలిలో ‘పిల్ల’గాలికి ప్రియుడు, సైరా మామా అంటూ లేడీ ?

బైక్ ల మీద ప్రేమికులు రొమాన్స్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బైక్ ల్లో రొమాన్స్ చెయ్యడం ఓల్డ్ ఫ్యాషన్ అనుకున్న ఓ జంట ఏకంగా కారు సన్ రూఫ్ మీద రొమాన్స్ చేశారు.

లక్నో/ఉత్తరప్రదేశ్: ఇటీవల కాలంలో ప్రేమికులు బైక్ లో మీద రొమాన్ప్ చెయ్యడం ఎక్కువ అయ్యింది. బైక్ ల మీద ప్రేమికులు రొమాన్స్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బైక్ ల్లో రొమాన్స్ చెయ్యడం ఓల్డ్ ఫ్యాషన్ అనుకున్న ఓ జంట ఏకంగా కారు సన్ రూఫ్ మీద రొమాన్స్ చేశారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో కారు సన్ రూఫ్ మీద జంట రొమాన్స్ చేస్తూ వెలుతున్న సమయంలో వెనుక నుంచి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. సమజానికి వీళ్లు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకున్నారు ? అంటూ సోషల్ మీడియాలో ఆ జంటను ఏకిపారేస్తున్నారు.

లక్నోలో కారు సన్ రూఫ్ లో రొమాన్స్

లక్నోలో కారు సన్ రూఫ్ లో రొమాన్స్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏదో ఒకరకంగా ప్రతినిత్యం వార్తల్లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లో నేరాలు, ఘోరాలకు కూడా ఏమాత్రం కొదవలేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని నిత్యం రద్దీగా ఉండే లోహియా పాత్ ప్రాంతంలో రాత్రిపూట కారు సన్ రూఫ్ మీడ ఓ జంట రొమాన్స్ చేస్తూ వీధుల్లో తిరగడం హాట్ టాపిక్ అయ్యింది. ఎక్కడ చోటు లేనట్లు అందరికి కనపడేలా రొమాన్స్ చేసిన జంటకు సరైన ట్రీట్ మెంట్ ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ పోలీసులు డిసైడ్ అయ్యారు.

మంచి టైమ్ లో చిక్కారు

ఉత్దరప్రదేశ్ లో ఇటీవల కాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అనుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు రోడ్డు సేఫ్టీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎంబ్రేస్ సేఫ్ డ్రైవింగ్ పేరుతో జనవరి 5వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు సేఫ్ రైడింగ్ మంత్ (నెల) అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆ రాష్ట్రం మొత్తం వాహనాలు నడుపుతున్న వారికి హితబోధ చేస్తున్నారు.

పోలీసులకు ఎక్కడో కాలిపోయింది

పోలీసులకు ఎక్కడో కాలిపోయింది

ఇలాంటి సమయంలోనే వేగంగా వెలుతున్న కారులోని సన్ రూఫ్ మీద జంట రొమాన్స్ చెయ్యడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు మండిపడుతున్నారు. వేగంగా వెలుతున్న కారు సన్ రూఫ్ లో నుంచి తల బయటకు పెట్టడం నేరం. అలాంటిది వేగంగా వెలుతున్న కారు సన్ రూఫ్ లో నుంచి తలలు బయట పెట్టి రొమాన్స్ చేసిన జంట వీడియోను చూసిన ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఎక్కడో కాలిపోయింది. మోటారు వాహన చట్టం ప్రకారం ఆ జంట మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు సిద్దం అయ్యారు.

జరిమానా...... జైలు శిక్ష

మోటారు వాహన చట్టం ప్రకారం నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడిపినా, ప్రమాదాలకు కారణం అయ్యేలా ప్రవర్తించిన వారికి అపరాదరుసుం విధించే అవకాశం ఉంది. లేదంటే ఆరు నెలలు జైలు శిక్షపడే అవకాశం ఉంది. పదేపదే అదే పద్దతిలో నియమాలు ఉల్లంఘించే వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. చల్లగాలిలో పిల్లగాలి సోకిన ప్రియుడు రెచ్చిపోవడం, సైరా మామా అంటూ ప్రియురాలు రొమాన్స్ చెయ్యడంతో వారి మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

బూతులు తిడుతున్నా పట్టించుకోలేదు

బూతులు తిడుతున్నా పట్టించుకోలేదు

లక్నోలో కారు సన్ రూఫ్ మీద ఓ జంట రొమాన్స్ చేస్తున్న సమయంలో వెనుక నుంచి కొందరు వీడియోలు తీశారు. అసలు నువ్వు ఆడదానివేనా, సిగ్గుమాలిన పని పబ్లిక్ లో చేస్తారా అంటూ వెనుక వెలుతున్న వారు బూతులు తిడుతున్నా ఆ జంట మాత్రం కారు సన్ రూఫ్ లో తలలు బయటపెట్టి రొమాన్స్ చేస్తూనే వెళ్లారు. కారు సన్ రూఫ్ రొమాన్స్ వీడియో ఉత్తరప్రదేశ్ పోలీసుల చేతికి చిక్కింది. కారు నెంబర్ కూడా పోలీసుల చేతిలో ఉంది. లక్నోలోని ఆ రొమియో, జూలియట్ కు పోలీసులు జిలేబి తినిపిస్తారా, హల్వా తినిపిస్తారా అనే విషయం వేచిచూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+