Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lovers: ఏకాంతంలో ఏం జరిగిందో ?, 300 అడుగుల లోయలో ప్రియురాలిని తోసి ఆత్మహత్య!

కొచ్చి/ చెన్నై: కాలేజ్ లో చదువుతున్న అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుని ఇంతకాలం అందరు ప్రేమికులు లాగా సంతోషంగా కలిసిమెలసి తిరిగారు. ప్రేమికుల పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. విషయం ఇంట్లో వాళ్లకు తెలిసిపోయింది. మేము చచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకోమని అబ్బాయి ఇంట్లో పాత సినిమా డైలాగ్ చెప్పారు. బైక్ లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పోయించుకున్న ప్రియుడు ప్రియురాలిని పిలుచుకుని ఓ కొండ మీదకు వెళ్లిపోయాడు.

కొండ మీద రెండు రోజులు ప్రేమికులు ఏకాంతంగా గడిపారు. ప్రేమికులు ఏకాంతంగా గడుపుతున్న సమయంలో మాటామాటా పెరిగిపోయింది. సహనం కోల్పోయిన ప్రియుడు ప్రియురాలిని 300 అడుగుల లోయలోకి తోసేసి తరువాత అతను అదే పర్వతం మీద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

టీనేజ్ లవర్స్

టీనేజ్ లవర్స్

కేరళలోని ఇడుక్కి జిల్లా తోడుపుజ సమీపంలోని మెలుకావు ప్రాంతంలో అలెక్స్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల రెజీనా (పేరు మార్చడం జరిగింది) అనే అమ్మాయి వెంట అలెక్స్ తిరిగాడు. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న అలెక్స్, రెజీనా గత ఏడాది ప్రేమలో పడ్డారు.

నో అంటూ పాత సినిమా డైలాగ్

నో అంటూ పాత సినిమా డైలాగ్

అందరి ప్రేమికులు లాగా అలెక్స్, రెజీనా కలిసి పార్క్ లు, సినిమాలు, షికార్లకు తిరిగారు. అలెక్స్ బైక్ లో రెజీనా కేరళలోని సుందరమైన ప్రాంతాలకు ఉదయం వెళ్లి మళ్లీ సాయంత్రం వారి ఇళ్లకు చేరుకునేవాళ్లు. అలెక్స్, రెజీనా ప్రేమ వ్యవహారం ఇటీవల వాళ్ల కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. మేము చచ్చినా రెజీనాను నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోమని అలెక్స్ తల్లిదండ్రులు పాత సినిమా డైలాగ్ చెప్పారు.

ప్రేమికులు ఎస్కేప్

ప్రేమికులు ఎస్కేప్

అలెక్స్ కుటుంబ సభ్యులు పెళ్లికి వ్యతిరేకించడంతో ప్రేమికులు ఇంటి నుంచి పారిపోవాలని డిసైడ్ అయ్యారు. అంతే అలెక్స్ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుని అతని బైక్ లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పోయించుకుని ప్రియురాలు రెజీనా దగ్గరకు వెళ్లారు. అప్పటికే బట్టలు సర్దుకున్న రెజీనా ప్రియుడు అలెక్స్ తో కలిసి బైక్ లో పారిపోయింది.

ఏకాంతంలో ఏం జరిగిందో?

ఏకాంతంలో ఏం జరిగిందో?

మూడు రోజుల పాటు వెంట తీసుకెళ్లిన ఆహారంతో నదుకానిసురం పర్వతం మీద ప్రేమికులు ఏకాంతంగా గడిపారు. చాల మనోహరంగా ఉన్న కొండ మీద ఎవ్వరూ లేకపోవడంతో ప్రేమికులు చాలా సంతోషంగా ఏకాంతంగా గడిపారు. ఓ పెద్ద లోయ మీద కొండ చివర్లో వ్యూవింగ్ పాయింట్ దగ్గర అలెక్స్, రెజీనా కుర్చుకుని మాట్లాడుతున్న సమయంలో మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన అలెక్స్ ప్రియురాలు రెజీనాను 300 అడుగుల లోతు ఉన్నలోయలో తోసేసి తరువాత అతను చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కొండ మీద ఉన్నారని వెళితే ?

కొండ మీద ఉన్నారని వెళితే ?

ప్రేమికులు పారిపోవడం, రెజీనా మైనర్ కావడంతో కేసు నమోదు అయ్యింది. పోలీసులు అలెక్స్, రెజీనా కోసం గాలించారు. అలెక్స్ మొబైల్ ఫోన్ నెట్ వర్క్ టవర్ ఆధారంగా, ప్రత్యక్షసాక్షలు చెప్పిన వివరాలు ఆధారంగా పోలీసులు కేరళలోని నదుకానిసురం పర్వతం మీద ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు.

శవమైన ప్రియుడు

శవమైన ప్రియుడు

కొండ మీద బైక్ బ్యాగ్ కనపడటంతో పోలీసులు చుట్టుపక్కల ప్రేమికుల కోసం గాలించారు. అంతే ఓ చెట్టుకుని అలెక్స్ ఉరి వేసుకుని శవమై వేలాడుతూ కనిపించడంతో పోలీసులు షాక్ అయ్యారు. చుట్టుపక్కల రెజీనా కోసం గాలించినా ఆమె ఆచూకిమాత్రం చిక్కలేదు. పోలీసులకు అనుమానం వచ్చి లోయలోకి దిగి పరిసర ప్రాంతాల్లో గాలించడం మొదలుపెట్టారు.

ప్రాణాలతో ప్రియురాలు

ప్రాణాలతో ప్రియురాలు

300 అడుగుల లోతు ఉన్న లోయలో గాలించి తీవ్రగాయాలై రక్తపు మడుగులో పడి ఉన్న రెజీనాను గుర్తించిన పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. రెజీనాను లోయలోకి తోసి వేసిన తరువాత ఆమె కోసం అలెక్స్ గాలించాడని. రక్తపు మడుగులో స్పృహ కోల్పోయి పడి ఉన్న రెజీనాను చూసి ఆమె చనిపోయిందనే భయంతో అలెక్స్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అంటున్నారు.

రెజీనా మెల్లిమెల్లిగా కోలుకుంటోందని పోలీసులు అన్నారు. పెద్దలను ఎదరించి పారిపోయిన ప్రేమికుల కధ విషాదం కావడంతో వాళ్ల కుటుంబ సభ్యులు ఇప్పుడు పొరపాటు చేశామని ఆవేదనచెందుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+