Lovers: కాలేజ్ లవర్స్, పెళ్లికి ముందే ఎంజాయ్, పర్సనల్ లైఫ్, ప్రియురాలిని సజీవదహనం చేశాడు !

భువనేశ్వర్/ హైదరాబాద్: ఒకే కాలేజ్ లో యువతి, యువకుడు చదువుకున్నారు. సినిమా స్టైల్లో సైట్ కొట్టి వెంటపడుతున్న యువకుడి మాయమాటలు నమ్మిన యువతి అతని ప్రేమలో పడిపోయింది. కొంతకాలం అమాయకుడిలా నటించిన ప్రియుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియురాలితో ఎంజాయ్ చేశాడు. పెళ్లి అయిన తరువాత ఇతనితోనే కాపురం చెయ్యాలి కదా అంటూ అమాయకురాలు అతనితో పెళ్లికి ముందే సంసారం చేసేసింది. ప్రియురాలి మీద ఆమె ప్రియుడు మోజు తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని యువతి ప్రియుడి మీద ఒత్తిడి చేసింది. ప్రియురాలిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ప్రియుడు యువతి మీద మోజు తీరిపోయిందనుకుని ఆమెకు దూరం కావడానికి ప్రయత్నించాడు. ప్రియురాలితో పెళ్లి సమస్య పెద్దది కావడంతో ప్రియుడు అతని సొంత ఊరికి ఆమెను పిలుచుకుని వెళ్లి ఆమె మీద పెట్రోల్ పోసి సజీవదహనం చేయడం కలకలం రేపింది.

 అమ్మాయి వెంట పడిన యువకుడు

అమ్మాయి వెంట పడిన యువకుడు

ఒడిశాలోని గంజాం జిల్లాలోని పత్తపూర్ గ్రామంలో క్రిష్ణచంద్ సాహూ అలియాస్ సాహూ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. జొలంబో గ్రామంలో నివాసం ఉంటున్న సుస్మితా ఖండగ (25) అనే యువతిని చూసిన క్రిష్ణచంద్ ఆమె మీద మోజుపడ్డాడు. బరంపురం కాలేజ్ లో చదువుతున్న క్రిష్ణచంద్, సుస్మితాకు పరిచయం అయ్యింది.

 ఐ లవ్ యూ

ఐ లవ్ యూ

ఒకే కాలేజ్ లో చదువుతున్న క్రిష్ణచంద్, సుస్మితా రోజు కలిసేవాళ్లు. సినిమా స్టైల్లో సైట్ కొట్టి వెంటపడుతున్న క్రిష్ణచంద్ మాయమాటలు నమ్మిన సుస్మితా అతని ప్రేమలో పడిపోయింది. కొంతకాలం అమాయకుడిలా నటించిన ప్రియుడు క్రిష్ణచంద్ నిన్ను పెళ్లి చేసుకుంటానని సుస్మితాకు మాయమాటలు చెప్పాడు.

 పెళ్లికి ముందే అన్నీ జరిగిపోయాయి

పెళ్లికి ముందే అన్నీ జరిగిపోయాయి

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన క్రిష్ణచందన్ అతని ప్రియురాలితో ఎంజాయ్ చేశాడు. పెళ్లి అయిన తరువాత క్రిష్ణచంద్ తోనే కాపురం చెయ్యాలి కదా అంటూ అమాయకురాలైన సుస్మితా అతనితో పెళ్లికి ముందే సంసారం చేసేసింది. సొంతఊర్లకు దూరంగా ఉంటూ మూడు సంవత్సరాల పాటు కాలేజ్ లో చదువుతున్న క్రిష్ణచంద్, సుస్మితా పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు.

 పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి

ప్రియురాలు సుస్మితా మీద ఆమె ప్రియుడు క్రిష్ణచంద్ మోజు తీర్చుకున్నాడు. కరోనా వైరస్ కారణంగా కాలేజ్ మూతపడటంతో ప్రేమికులు ఎవరిఊర్లలో వాళ్లు ఉంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని సుస్మితా ఆమె ప్రియుడు క్రిష్ణచంద్ మీద ఒత్తిడి చేసింది. ప్రియురాలు సుస్మితాను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ప్రియుడు క్రిష్ణచంద్ ప్రియురాలి మీద మోజు తీరిపోయిందనుకుని ఆమెకు దూరం కావడానికి ప్రయత్నించాడు.

 పక్కాస్కెచ్ వేసిన ప్రియుడు

పక్కాస్కెచ్ వేసిన ప్రియుడు

ప్రియుడు తనను మోసం చేస్తున్నాడని సుస్మితాకు అనుమానం వచ్చింది. పెళ్లి చేసుకోకపోతే నీ మీద రేప్ కేసు పెడుతానని సుస్మితా ఆమె ప్రియుడిని బెదిరించిందని తెలిసింది. నిన్ను పెళ్లి చేసుకుంటానని, మా కుటుంబ సభ్యులను పరిచయం చేస్తానని సుస్మితాను నమ్మించిన ప్రియుడు క్రిష్ణచంద్ ఆమెను సొంత గ్రామానికి పిలుచుకుని వెళ్లి హత్యకు పక్కాప్లాన్ వేశాడు.

 ప్రియురాలిని సజీవదహనం చేసిన ప్రియుడు

ప్రియురాలిని సజీవదహనం చేసిన ప్రియుడు

రాత్రి బంధువుల ఇంటిలో ఉండాలని సుస్మితాకు చెప్పిన క్రిష్ణచంద్ తరువాత ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. మంటలు తట్టుకోలేక సుస్మితా గట్టిగా కేకలు వేసింది. గ్రామస్తులు విషయం గుర్తించి వెంటనే ఆమెను పురుషోత్తంపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సుస్మితా దాదాపుగా కాలిపోవడంతో ఆమెను ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ కు తరలించారు.

Recommended Video

    Viral Video : Watch How Alcohol Lovers Brave Hailstorm To Buy Liquor
     నా ప్రియుడే నన్ను చంపేశాడు

    నా ప్రియుడే నన్ను చంపేశాడు

    మెడికల్ కాలేజ్ లో చికిత్స పొందుతున్న సమయంలో సుస్మితా తన ప్రియుడు క్రిష్ణచంద్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేసి తనకు నిప్పంటించాడని పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చి ప్రాణాలు వదిలేసిందని గంజాం జిల్లా ఎస్పీ భ్రజేష్ కుమార్ రాయ్ మీడియాకు చెప్పారు. ప్రియురాలు సుస్మితాను సజీవదహణం చేసి పారిపోయిన క్రిష్ణచంద్ ను పట్టుకున్న గంజాం పోలీసులు అతన్ని బెండ్ తీస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+