తనకు దక్కనిది వేరొకరికి దక్కకూడదని, ప్రియురాలిపై పెట్రోల్ పోసి, తాను కూడ...

తనకు దక్కనిది , వేరొకరికి దక్కకూడదనే ఉన్మాదంతో ప్రియుడు ప్రియురాలిని సజీవదహనం చేశాడు. తాను కూకడ నిప్పంటించుకొని ఆత్మహత్యయత్నం చేసుకొన్నాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.

చెన్నై:తనకు దక్కనిది , వేరొకరికి దక్కకూడదనే ఉన్మాదంతో ప్రియుడు ప్రియురాలిని సజీవదహనం చేశాడు. తాను కూకడ నిప్పంటించుకొని ఆత్మహత్యయత్నం చేసుకొన్నాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.

చెన్నై అంబత్తూరు సమీపంలోని పుదురు కరుణానిధి నగర్ కు చెందిన పార్థిబన్ , లెనిన్ నగర్ కు చెందిన మైథిలి రెండున్నర ఏళ్ళ క్రితం అన్నానగర్ లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేసేవారు.

lovers suicide

ఇక్కడే వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్ళ చెట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. ఆరు మాసాల క్రితం వీరి ప్రేమ వ్యవహారం పెద్దల చెవినపడింది. మైథిలి తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారు.దీంతో పార్థిబన్ కు మైథిలి దూరం కావడం మొదలుపెట్టింది.

ఈ సమయంలో ఓ రోజుచ పార్థిబన్ కు ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి వచ్చి మైథిలి పరామర్శించింది. ఈ ఘటన తర్వాత మైథిలి పూర్తిగా దూరమైంది.మైథిలి దూరం కావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు పార్థిబన్.

పది రోజుల క్రితం మైథిలి పార్థిబన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను పార్థిబన్ తో కలిసి ఉన్న ఫోటోలు, వాట్సాప్ లలో మేసేజ్ లలో ఉన్నాయని, వాటిని తొలగించకుండా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టు అందులో వివరించింది. ఈ ఫిర్యాదుతో ఉన్మాదిగా మారి,పోయాడు పార్థిబన్.

పార్థిబన్ ను పోలీసులు స్టేషన్ కు పిలిపించి మందలించారు. అతడి వద్ద ఉన్న ఫోటోలను మేసేజ్ లను తొలగించారు. దీంతో పార్థిబన్ బెడద లేకుండా పోయిందని మైథిలి భావించింది. యధప్రకారంగా ఆమె తన పనుల్లో మునిగిపోయింది. అయితే మైథిలిని పార్థిబన్ రహాస్యంగా వెంటాడుతున్న విషయాన్ని ఆమె గమనించలేదు.

తిరుముల్ లైవాయిల్ బస్టాండ్ లో బస్సు దిగి మైథిలి వివేకానందనగర్ మీదుగా ఇంటికి కాలినడకన బయలుదేరింది. ఆమెను రహస్యంగా అనుసరించిన పార్థిబన్ నిర్మానుష్యంా ఉన్న రోజా వీధిలో అడ్డగించాడు.

తనను పెళ్ళిచేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. వీరిద్దరి మధ్య వాగ్వావాదం, తోపులాట చోటుచేసుకొంది. ఈ రోడ్డులో ఎవరూ లేకపోవడంతో వెంట తెచ్చుకొన్న పెట్రోల్ ను ప్రియురాలి మీద పోసి నిప్పంటించాడు తనపై కూడ పెట్రోల్ పోసి నిప్పంటించుకొన్నాడు.

మంటలకు తాళలేక ఇద్దరు కూడ పరుగులు తీశారు. స్థానికులు మంటలను ఆర్పి ఆసుపత్రికి తరలించారు. కీల్పాకం ఆసుపత్రిలో శనివారం తెల్లవారు జామును పార్థిబన్, మైథిలి మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+