Lovers: నాలుగు నెలల క్రితం లవ్ మ్యారేజ్, కోపంతో భార్య ఆత్మహత్య, భయంతో భర్త రైలు కిందపడి !
చెన్నై/సేలం: నాలుగు సంవత్సరాల నుంచి యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అందరి ప్రేమికుల్లాగే యువతి, యువకుడు అనేక ప్రాంతాల్లో తిరిగారు. వివాహం చేసుకుంటామని ప్రేమికులు వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. పెళ్లి చేసుకోవడానికి పెద్దలు అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించిన ప్రేమికులు కొన్ని నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న దంపతులు అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. ప్రేమించిన యువతిని వివాహం చేసుకున్న ప్రియుడు ఎప్పటిలాగే పని చేస్తూ భార్యను పోషిస్తున్నాడు. ఉదయం ఇంట్లో టిఫిన్ చేసిన భర్త పనికి వెళ్లాడు. తరువాత ఇంట్లో భర్త మీద కోపంగా ఉన్న నవవధువు ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వాళ్లు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై నవవధువు చనిపోయింది. ప్రేమ వివాహం చేసుకున్న భార్య ఆత్మహత్య చేసుకుందనే భయంతో ఆమె భర్త కూడా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ఒకే ప్రాంతంలో యువతి, యువకుడు
తమిళనాడులోని సేలంలోని కొండలంపట్టి కలర్ కాడ్ ప్రాంతంలో రవి కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బైక్ మెకానిక్ గా పని చేస్తున్న రవి కుమార్ అదే ప్రాంతంలో సొంతంగా గ్యారేజ్ పెట్టుకున్నాడు. రవి కుమార్ నివాసం ఉంటున్న ఏరియాలోనే శరణ్య నివాసం ఉంటున్నది. శరణ్యకు, రవి కుమార్ కు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది.

పెళ్లికి నో చెప్పిన పెద్దలు
నాలుగు సంవత్సరాల నుంచి శరణ్య, రవి కుమార్ ప్రేమించుకున్నారు. అందరి ప్రేమికుల్లాగే శరణ్య, రవి కుమార్ అనేక ప్రాంతాల్లో తిరిగారు. వివాహం చేసుకుంటామని ప్రేమికులు శరణ్య, రవి కుమార్ వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. పెళ్లి చేసుకోవడానికి శరణ్య, రవి కుమార్ పెద్దలు అంగీకరించలేదు.

నాలుగు నెలల ముందే పెళ్లి
పెద్దలను ఎదిరించిన ప్రేమికులు శరణ్య, రవి కుమార్ నాలుగు నెలల క్రితమే స్నేహితుల సహాయంతో సేలంలోని ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న దంపతులు శరణ్య, రవి కుమార్ కుటుంబ సభ్యులకు దూరంగా సేలంలోనే అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు.

ఒకే రోజు ఆత్మహత్యలు చేసుకున్న నవవధూవరులు
ప్రేమించిన యువతి శరణ్యను వివాహం చేసుకున్న ఆమె ప్రియుడు రవి కుమార్ ఎప్పటిలాగే పని చేస్తూ భార్యను పోషిస్తున్నాడు. ఉదయం ఇంట్లో టిఫిన్ చేసిన రవి కుమార్ గ్యారేజ్ లో పనికి వెళ్లాడు. తరువాత ఇంట్లో ఉన్న నవవధువు శరణ్య ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వాళ్లు విషయం గుర్తించి శరణ్యను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై నవవధువు శరణ్య ఆసుపత్రిలో చనిపోయింది. ప్రేమ వివాహం చేసుకున్న భార్య శరణ్య ఆత్మహత్య చేసుకుందనే భయంతో ఆమె భర్త రవి కుమార్ కూడా సేలం నగరం సమీపంలోకి వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications