బీజేపీ మా రక్తంలో ఉంది: సొంతగూటికి గాలి జనార్ధన్ రెడ్డి, రేపే పార్టీ విలీనం

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత గూటికి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడారు. సోమవారం మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నేతల సమక్షంలో పార్టీలోకి చేరనున్నట్టు గాలి తెలిపారు. బీజేపీ తమ రక్తంలో ఉందన్నారు. ఇప్పుడు సొంత పార్(BJP)టీలోకి తిరిగి వస్తున్నట్లు చెప్పారు.

అయితే ఒకానొక సమయంలో బీజేపీకి బయట నుంచి మద్దతు ఇచ్చే ప్రశ్న తలెత్తిందని, కానీ తన పార్టీ కార్యకర్తలు విలీనానికి ఓటు వేశారని గాలి జనార్థన్ రెడ్డి చెప్పారు. అంతేగాక, బీజేపీ తమ రక్తంలోనే ఉందని గాలి చెప్పుకొచ్చారు. మళ్లీ నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేందుకు తాను మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ పార్టీలో చేరి సాధరణ కార్యకర్తగా పని చేస్తానని చెప్పుకొచ్చారు.

LS polls Gali Janardhan Reddy to rejoin BJP on March 25 and merge his party

కాగా, 2022లోనే జనార్దన్​ రెడ్డి స్థాపించిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేర్​పీపీ)ని బీజేపీలో విలీనం చేయడానికి, పార్టీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. జనార్దన్​ రెడ్డితో పాటు కేర్​పీపీ నేతలంతా బీజేపీ కండువా కప్పుకోనున్నారు. పార్టీ విలీన విషయమై జనార్దన్​ రెడ్డి ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్​ షాతో చర్చలు జరిపారు.

తాజాగా, తన పార్టీ మద్దతుదారులతో, కేర్​పీపీ భవిష్యత్తుపై సుదీర్ఘంగా చర్చించారు గాలి జనార్ధన్ రెడ్డి. అనంతరం పార్టీని బీజేపీలో విలీనం చేయాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశం అనంతరం జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీలో చేరాలని బీజేపీ నుంచి ఆహ్వానం అందింది. సోమవారం విజయేంద్ర సమక్షంలో బీజేపీలో చేరబోతున్నాను. చిత్రదుర్గ, గుల్బర్గా, కొప్పల్​, రాయచూర్, బళ్లారి, విజయనగరం నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు నా నిర్ణయానికి మద్దతు తెలిపారు. బీజేపీలో పార్టీని విలీనం చేసేందుకు అందరూ అంగీకరించారు అని గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.

అయితే, ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటు కాంగ్రెస్​‌కు వేశారు జనార్దన్ రెడ్డి. కాగా, అది తన మనస్సాక్షి ఓటని తాజాగా సమర్థించుకున్నారు. ఇక మాజీ మంత్రి శ్రీరాములుతో తనకు విభేదాలేం లేవని చెప్పారు. ఆయన్ను చిన్నప్పటి నుంచి తాను పెంచినట్లు తెలిపారు. బళ్లారి లోక్‌​సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములుకు మద్దతిస్తానని చెప్పారు. కాగా, బీఎస్​ యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, గనుల అక్రమ తవ్వకాల నేపథ్యంలో గాలి జైలుకు వెళ్లారు. తర్వాత బీజేపీకి దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+