Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్, గాడ్సే దేవుడంటూ, రికార్డుల నుంచి తొలగింపు

బీజేపీ వివాదాస్పద ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరోసారి కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. గతంలో తాను చేసిన నాథురాం గాడ్సే వ్యాఖ్యలను ఉద్ఘాటించారు. బుధవారం లోక్‌సభలో ఎస్పీజీ చట్టసవరణపై చర్చ జరిగే సమయంలో డీఎంకే ఎంపీ రాజా మాట్లాడుతున్నారు. గాంధీని ఎందుకు చంపాననే దానిపై గాడ్సే చేసిన ప్రకటనను ఉదహరించారు. ఇంతలో రాజా ప్రసంగానికి ప్రజ్ఞాసింగ్ అడ్డుతగిలారు. దేశభక్తి గురించి సలహాలు ఇవ్వకండి అంటూ వ్యాఖ్యానించారు.

ఇదివరకు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడిగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు తీవ్రంగా ప్రతిఘటించాయి కూడా. ఇవాళ మరోసారి అదేవిధంగా కామెంట్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. బీజేపీ సభ్యులు కూడా ప్రజ్ఞాసింగ్ తన స్థానంలో కూర్చొవాలని సూచించారు. సభలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు.

LS Speaker expunges Sadhvi Pragyas deshbhakt remark about Nathuram Godse

విపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకతతో బీజేపీ ఎంపీలు కూడా ప్రజ్ఞాసింగ్‌కు మద్దతు తెలియజేయలేదు. దీంతో గతంలో ఒకసారి క్షమాపణలు కూడా తెలియజేశారు. దీనిపై సభలో రాజా స్పందించారు. గాంధీపై 32 ఎళ్లుగా కోపం పెంచుకున్నానని.. అందుకే చంపానని గాడ్సే ఒప్పుకున్నాడని తెలిపారు. భద్రత అనేది రాజకీయ కారణాలతో కాదని.. వారికి ఉన్న బెదిరింపులను బట్టి కల్పించాల్సి ఉంటుందని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+