వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత తదుపరి ఆర్మీ చీఫ్‌గా మనోజ్ ముకుంద్: విశిష్ట సేవలకు మెడల్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లెఫ్ట్‌నెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావణే తదుపరి భారత సైన్యాధిపతి కానున్నట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. 1.3 మిలియన్ల సైన్యానికి ఆయన అధిపతి కానున్నారు. ప్రస్తుతం లెఫ్ట్‌నెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావణే ఆర్మీ వైస్ చీఫ్‌గా కొనసాగుతున్నారు.

డిసెంబర్ 31న ప్రస్తుత ఆర్మీ అధిపతి జనరల్ బిపిన్ రావత్ రిటైర్మెంట్ తీసుకోనున్న నేపథ్యంలో ఆయన స్థానాన్ని మనోజ్ ముకుంద్ భర్తీ చేయనున్నారు. కాగా, ఆర్మీ వైస్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకునే ముందు చైనాకు 4వేల కిలోమీటర్ల సరిహద్దు గల ప్రాంతాన్ని రక్షించే ఈస్టెర్న్ కమాండ్ అధిపతి మనో ముకుంద్ పని చేశారు.

Lt Gen Manoj Mukund Naravane to be next Army Chief

లెఫ్ట్‌నెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావణే తన 37ఏళ్ల సర్వీసులో ఎంతో మంది కమాండ్, స్టాఫ్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. జమ్మూకాశ్మీర్, నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కోసం ఆయన చేసిన కృషి చాలానే ఉంది.

శ్రీలంకలో భారత రక్షణ దళం తరపున ఇండియన్ పీస్ కీపింగ్ పోర్స్‌లో కూడా ముకుంద్ పనిచేశారు. అంతేగాక, మయన్మార్‌లోని భారత రాయబార కార్యాలయంలో మూడేళ్లు సేవలందించారు. అంతేగకా, మనోజ్ ముకుంద్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలిటరీ అకాడమీ పూర్వ విద్యార్థి.

జూన్ 1980లో సిక్కు లైట్ ఇన్ఫ్యాంట్రీ రెజిమెంట్ 7వ బెటాలియన్‌లో ఆయన తొలి నియామకం జరిగింది. జమ్మూకాశ్మీర్‌లో బెటాలియన్‌ను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఆయనకు సేన మెడల్ అందించారు. నాగాలాండ్‌లోని జనరల్ అస్సాం రైఫిల్స్(నార్త్)గా అందించిన సేవలకు గానూ ముకుంద్‌ను విశిష్ట సేవా మెడల్ వరించింది.

English summary
Lt Gen Manoj Mukund Naravane is set to become the next chief of the 1.3 million-strong Indian Army, official sources said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X