ఆరుగురు కుటుంబ సభ్యులను నరికి చంపాడు

 Lucknow: man kills six members of his family
లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యంత హృదయవిదాకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన కుటుంబ సభ్యులని కూడా చూడకుండా ఓ వ్యక్తి ఆరుగురిని నరికి చంపాడు. ఆస్తిదాహంతో అతను ఈ కిరాతక చర్యకు ఒడిగట్టాడు. ఆస్తి తగాదాలో అతను ఆరుగురు కుటుంబ సభ్యులను హత్య చేశాడు. శుక్రవారంనాడు పోలీసులు ఈ విషయం చెప్పారు.

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులందేశ్వర్ జిల్లాలోని పిల్కానా గ్రామంలో గత రాత్రి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన తండ్రిని, తన సోదరుడిని, సోదరుడి భార్యను, వారిద్దరి పిల్లలను, మరో వ్యక్తిని నరికి చంపాడు. వారంతా అక్కడికక్కడే మరణించారు

ఇళ్లంతా రక్తంతో తడిసిపోయింది. మృతుల దేహాలపై పలు గాయాలున్నాయి. ఇటుక బట్టీలకు సంబంధించిన తగాదా కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు మీరట్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆలోక్ శర్మ చెప్పారు.

అత్యంత దారుణమైన ఈ సంఘటన గ్రామంలో తీవ్ర సంచలనం సృష్టించింది. తీవ్ర కలకలం చెలరేగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+