ఆమె నక్కతోక తొక్కింది... పొలంలో వారంలోనే 8 వజ్రాల పంట పండింది

అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. దరిద్రమైనా అంతే అనుకోండి. అదృష్టం కలిసి వస్తే బంటు కూడా రాజు అవుతాడు. దేశాన్ని ఏలేస్తాడు. చాలామంది కష్టపడి సాధించారు అని చెప్పుకున్నా, వారికి అదృష్టం కూడా అనుకూలించింది అనేది ప్రతి ఒక్కరు ఒప్పుకుని తీరాల్సిన అంశం. ఈ భూమ్మీద కష్టపడి పనిచేసే వాళ్లు ఎంతమంది ఉన్నా, మంచి గుర్తింపు మాత్రం అదృష్టవంతులకే వస్తుంది.

రైతు కుటుంబం తలరాతను మార్చిన వజ్రాలు
లక్కుంటే అడుక్కుతినే వాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు.ఎందుకు చెబుతున్నాము అంటే ఇటువంటి అదృష్టమే ఒక పేద మహిళను వరించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళను వారం రోజుల్లోనే లక్ష్మీదేవి తలుపు తట్టి మరీ పిలిచింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లాలో సాధారణ రైతు కుటుంబం తలరాతను మార్చేశాయి ఆమె పంట పొలంలో దొరికిన వజ్రాలు.

lucky woman farmer got 8 diamonds in a week in her field

వారం రోజుల్లో 8 వజ్రాలు
వారం రోజుల వ్యవధిలోనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 విలువైన వజ్రాలు ఆమెకు దొరికాయి. పన్నా పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలోని బద్గడి ఖుర్ద్ గ్రామంలో రచనా గోల్దార్, ఆమె భర్త రాధారమణ గోల్దార్ గ్రామంలో సొంత భూమి ఉంది. ఈ భూమిలో వీరు వజ్రాల అన్వేషణకు అనుమతులు పొందారు. తవ్వకాలు ప్రారంభించిన వారం రోజుల్లోనే వీరికి ఎనిమిది వజ్రాలు దొరికాయి.

వజ్రాల కార్యాలయంలో వజ్రాల అప్పగింత
వీరికి దొరికిన వజ్రాలను వజ్రాల కార్యాలయానికి తీసుకువెళ్లి కార్యాలయంలో అప్పగించారు. భూమిని లీజుకు తీసుకొని తమ పొలంలో గని ఏర్పాటు చేసుకున్నామని, వారం రోజుల్లోనే తమకు ఎనిమిది వజ్రాలు దొరికాయి అని, తమ వద్ద అవి ఉండడం సేఫ్ కాదని భావించి కార్యాలయంలో అప్పగించినట్లు రచన తెలిపారు.

వజ్రాలకు మంచి ధర వచ్చే అవకాశం
వీరికి దొరికిన మొత్తం ఎనిమిది వజ్రాల బరువు 3.10 క్యారెట్లు గా ఉందని, వీటిలో ఆరు అత్యుత్తమ నాణ్యత కలిగి ఉండగా, రెండు కాస్త తక్కువ గ్రేడ్ లో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. త్వరలో ఈ వజ్రాలను వేలం వేసి వచ్చిన మొత్తాన్ని రచన గోల్దార్ కు అందజేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ వజ్రాలకు మంచి ధర వచ్చే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒకే వారంలో 8 వజ్రాలు దొరికిన అరుదైన ఘటన
ఇప్పటివరకు పన్నా ప్రాంతంలో వజ్రాలు దొరకడం కొత్త కాదు. ఈ ప్రాంతంలో చాలామంది రాత్రికి రాత్రే వజ్రాల కారణంగా లక్షాధికారులు అయ్యారు. అయితే ఒక వారం రోజుల వ్యవధిలోనే ఎనిమిది వజ్రాలు దొరకటం మాత్రం చాలా అరుదైన విషయమని ఇక్కడ వారు అనుకుంటున్నారు. అదృష్ట లక్ష్మి వరిస్తే ఇలానే ఉంటుందని ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+