వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పరువు కోసం తల్లిదండ్రులే డ్రగ్స్ ఇచ్చి కూతుళ్ళను ఇలా'...చివరికిలా...

పరువు కోసం ఇద్దరు కూతుళ్ళను కాలువలో వేశారు తల్లిదండ్రులు. అయితే వీరిలో ఒ అమ్మాయి చనిపోగా,మరో అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లూథియానా:తమ కూతుళ్లకు బోయ్ ప్రెండ్స్ ఉన్నారనే అక్కసుతో ఇద్దరు పిల్లలను కాలువలో వేశారు తల్లిదండ్రులు. అయితే ఈఘటనలో 15 ఏళ్ల జ్యోతి అనే బాలిక మరణించగా, ఆమె సోదరి ప్రీతి మాత్రం ప్రాణాలను దక్కించుకొంది.ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో చోటుచేసుకొంది.

కూతుళ్ళకు బోయ్ ఫ్రెండ్స్ ఉన్నారనే కారణంగా ఇద్దరు కూతుళ్ళను హత్య చేయాలని ప్లాన్ చేశారు తల్లిదండ్రులు. పంజాబ్ రాష్ట్రంలో లూథియానాకు చెందిన ఆటో డ్రైవర్ ఉదయ్ చంద్, అతడి భార్య తమ ఇద్దరు కూతుళ్ళను చంపాలని ప్లాన్ చేశారు.

ఈ ఇద్దరూ అమ్మాయిలు పదో తరగతి చదువుతున్నారు. ఇటీవల తమ ఇద్దరు కూతుళ్ళు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు.దీంతో వాళ్ళకు బోయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తల్లిదండ్రులు అనుమానించారు.

Ludhiana girls thrown by parents in canal for having boyfriends, one dies

అయితే పిల్లలకు అనుమానం రాకుండా వారు తినే ఆహరంలో డ్రగ్స్ కలిపారు. అమ్మాయిలిద్దరూ స్పృహ కోల్పోయాక వాళ్ళను కాలువలో పారేశారు.

జ్యోతిని కాలువలో విసిరేసే ముందు జ్యోతిని కాలువలోకి విసిరేసే ముందు దుప్పట్టాతో ఆమె పీక పిసికేందుకు ప్రయత్నించినట్టు చెప్పారు. ఒకరోజు తర్వాత ఇద్దరూ నీళ్ళలో తేలుతూ కన్పించారు. లూథియానాలో బరేవాల్ బ్రిడ్జి వద్ద అటువైపు వెళ్ళేవాళ్ళు బయటకు తీశారు.

స్థానిక ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే జ్యోతి మరణించగా, ప్రీతి పోలీసులకు ముందు అబద్దాలు చెప్పింది.ఇద్దరం అనాథలమని, గుడి వద్ద భిక్షాటన చేస్తామని గుర్తు తెలియని వ్యక్తు ఇచ్చిన ఆహరం తిని స్పృహ కోల్పోయామని తెలిపింది. పోలీసులు బాధితురాలిని గట్టిగా నిలదీస్తే అసలు విషయాన్ని తెలిపింది.

English summary
An auto driver and his wife in Punjab’s Ludhiana allegedly drugged their two teenage daughters and threw them into a canal after suspecting them of having boyfriends, police said on Wednesday.One of the girls – 15-year-old Jyoti died while her sister Priti survived. Police have charged the parents Uday Chand and Laxmi with murder and attempted murder, and have launched a manhunt for the absconding suspects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X