పంజాబ్‌లో దారుణం: నడిరోడ్డుపై మహిళను గొడ్డలితో నరికి.. సెల్ఫీ వీడియో!
రోడ్డుపై ఆమె నడుచుకుంటున్న వెళ్తున్న సమయంలో విచక్షణారహితంగా గొడ్డలితో దాడి చేసి నరికిచంపాడు. హత్య తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాంతో సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు.
లూథియానా: తన అక్రమ సంబంధాన్ని ఎక్కడ బయటపెడుతుందో అన్న అనుమానంతో ఓ మహిళను నడిరోడ్డుపై అతిదారుణంగా గొడ్డలితో నరికి చంపాడో వ్యక్తి. పంజాబ్‌లోని లూధియానాలో ఈ దారుణం జరిగింది. హత్యానంతరం మహిళ మృతదేహం పక్కనే నిందితుడు సెల్ఫీ వీడియో దిగడం గమనార్హం.
కిలా రాయ్‌పూర్ గ్రామంలో ఆదివారం నాడు ఈ ఘటన చోటు చేసుకోగా.. హత్య చేసిన తర్వాత నిందితుడే స్వయంగా పోలీసులకు సమాచారం అందించాడు. వివరాల్లోకి వెళ్తే.. కిలా రాయ్ పూర్ గ్రామంలోని ఓ మహిళతో మనీందర్ సింగ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గత కొన్నాళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారం వేరే మహిళ కంటపడింది. అప్పటినుంచి మనిందర్‌సింగ్‌ను ఆమె బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది.

పదేపదే బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతుండటంతో.. మనిందర్ సింగ్ సహించలేకపోయాడు. ఆమెను హత్య చేయడమే ఇందుకు పరిష్కారమని నిర్దారించుకుని.. రోడ్డుపై ఆమె నడుచుకుంటున్న వెళ్తున్న సమయంలో విచక్షణారహితంగా గొడ్డలితో దాడి చేసి నరికిచంపాడు. హత్య తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాంతో సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. అనంతరం తానే స్వయంగా పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications