Lunar eclipse 2023: త్వరలోనే అరుదైన చంద్రగ్రహణం.. మన దేశంలో కనబడుతుందా?
మరికొద్ది రోజుల్లో అరుదైన చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. 2023 మే 5వ తేదీన ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం సంభవించనుంది. అయితే ఈ సారి ఏర్పడే అరుదైన చంద్రగ్రహణం పెనుంబ్రల్ చంద్రగ్రహణం గా చెబుతున్నారు. భారత ప్రామాణిక కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం మే 5వ తేదీన 08:44 ప్రారంభమవుతుంది. రాత్రి 10:52 కు గరిష్టానికి చేరుతుంది. మే 6వ తేది ఉదయం 01:01 లకు పెనుంబ్రల్ చంద్రగ్రహణం ముగుస్తుంది.
ఇక చంద్ర గ్రహణాలు మూడు రకాలుగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంపూర్ణ చంద్ర గ్రహణాలు, పాక్షిక చంద్ర గ్రహణాలు, పెనుంబ్రల్ చంద్రగ్రహణాలు ఏర్పడతాయని చెబుతున్నారు. చంద్రుడు భూమి యొక్క బయట నీడ గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు పెనుంబ్రల్ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇటీవల తొలి సూర్య గ్రహణం ఏర్పడగా ఇప్పుడు చంద్రగ్రహణం ఏర్పడనుంది.

అయితే ఈ చంద్ర గ్రహణాన్ని భారత దేశ వాసులు చూడగలుగుతారా అన్నది ప్రశ్న. ఆకాశం నిర్మలంగా ఉంటే భారత దేశంలో కొన్ని ప్రాంతాలలో చంద్రగ్రహణం కనిపిస్తుంది. మే 5వ తేదీన ఏర్పడబోయే చంద్రగ్రహణం లోని కొన్ని భాగాలలోనూ, ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రం, అంటార్కిటికా ప్రాంతాలలో చూసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చంద్ర గ్రహణాన్ని చూడాలనుకునే వారు మే 5వ తేదీన 08:44 తర్వాత చంద్ర గ్రహణాన్ని చూడవచ్చు. ఆకాశం స్పష్టంగా ఉంటే నేరుగానే చంద్ర గ్రహణాన్ని చూడవచ్చు. లేదంటే టెలిస్కోపును కానీ, బైనాక్యులర్ లను కానీ ఉపయోగించి చంద్ర గ్రహణాన్ని చూడవచ్చు. సూర్య గ్రహణాలను నేరుగా కంటితో చూడడం ప్రమాదం కానీ చంద్రగ్రహణానికి అటువంటి ప్రమాదం లేదని చెబుతున్నారు.
ఖగోళ దృగ్విషయం అయిన చంద్రగ్రహణం భూమి సూర్యుడు మరియు చంద్రుని మధ్య తిరుగుతున్న సమయంలో చంద్రునిపై నీడ పడడం వల్ల ఏర్పడుతుంది. ప్రస్తుతం మే 5వ తేదీన దేశంలో మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంటే మళ్లీ అక్టోబరు 28- 29 తేదీల మధ్య రెండో చంద్రగ్రహణం చోటు చేసుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తానికి మరో నాలుగు రోజుల్లోనే భారతదేశంలో చంద్రగ్రహణం కనువిందు చేసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ చంద్ర గ్రహణాన్ని వీక్షించవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications