ఈ-కామర్స్: 'గత రెండేళ్లలో ఆన్‌లైన్ సేల్స్ 100 శాతం పెరిగాయి'

న్యూఢిల్లీ: భారత్‌లోకి ఈ కామర్స్ వెబ్‌సైట్స్ తెరంగేట్రం చేసిన తర్వాత ఆన్‌లైన్ సేల్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, జబాంగ్, మింత్ర లాంటి వెబ్‌ సైట్స్ రాకతో గత రెండేళ్లో ఆన్‌లైన్ సేల్స్ వంద శాతానికి పెరిగినట్లు ఓ సర్వేలో వెల్లడైంది.

ఈ-కామర్స్‌లో అనతి కాలంలో అభివృద్ధి కనిపిస్తోందని, ఈ క్రమంలో ఆన్‌లైన్ సేల్స్ ప్రయోజనకరంగా మారాయని "మాస్టర్ కార్డ్ ఆన్‌లైన్ షాపింగ్ సర్వే-2014" నివేదికలో విడుదల చేసింది. ఆసియా ఫసిఫిక్‌లోని 14 దేశాల్లో జరిపిన సర్వేలో ఈ విషయం బయటపడింది. 70.1 శాతంతో మొబైల్ షాపింగ్‌లో చైనా తొలి స్ధానంలో నిలవగా, భారత్ 62.9 శాతం, తైవాన్ 62.6 శాతం, థాయ్‌లాండ్ 58.8 శాతం, ఇండోనేషియా 54.9 శాతంతో తొలి ఐదు స్ధానాల్లో నిలిచాయి.

వీరందరూ కూడా మొబైల్ ఉపయోగించే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నట్లు సర్వేలో పేర్కొన్నారు. భారత్‌లో అయితే 47.7 శాతం మాత్రమే దుకాణాలకు వెళ్లి షాపింగ్ చేసే సామర్థ్యం ఉందని సర్వేలో వెల్లడైంది. ఈ-కామర్స్ సంస్ధల యాప్‌లు వచ్చాక షాపింగ్ మరింత సౌకర్యవంతంగా మారిందని పేర్కొన్నారు.

M-commerce grows over 100 percent in India: MasterCard Survey

స్మార్ట్ ఫోన్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేసే వస్తువుల్లో ఎక్కువగా మొబైల్ ఫోన్‌లు లేదా మొబైల్ గాడ్జెట్సే 28.8 శాతం ఉన్నాయి. ఆ తర్వాత స్ధానాల్లో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసేందుకు సినిమా టిక్కెట్లు 26.7 శాతం కొనుగోలు, బట్టలు, ష్యాషన్ వస్తువులను 24 శాతం కొనుగోలు చేస్తున్నట్లు సర్వే పేర్కొంది.

ఇక ఆన్ లైన్ లావాదేవీల కోసం ఎక్కువ మంది డెబిట్ లేదా క్రెడిట్ కార్డులనే ఉపయోగిస్తున్నట్లు సర్వేలో పేర్కొంది. ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఇంటర్నెట్‌ని ఉపయోగించే దేశాల్లో 86.6 శాతంతో చైనా ముందు వరుసలో నిలవగా, భారత్ 81.2 శాతంతో రెండో స్ధానంలో నిలిచింది.

భారత్‌లో 95 శాతం మంది మొబైల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్‌ని వినియోగిస్తునట్లు ఈ సర్వేలో తేలింది. 2012 తర్వాత మొబైల్‌లో ఇంటర్నెట్ వినియోగం 20.2 శాతానికి పెరిగింది. గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సుమారు 25 మార్కెట్లలో మాస్టర్‌కార్డ్ ఆన్‌లైన్ సర్వే‌ని నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+