అపోలో ఆసుపత్రిలో చేరిన కరుణానిధి భార్య, తల్లి ఆశీర్వాదం తీసుకున్న స్టాలిన్, రాత్రి!
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎం. కరుణానిధి సతీమణి దయాళ్ అమ్మాళ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రాత్రి పొద్దపోయిన తరువాత అస్వస్తతకు గురైన దయాళ్ అమ్మాళ్ ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.
మంగళవారం డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా ఎంకే. స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎంకే. స్టాలిన్ తన తండ్రి దివంగత నేత ఎం. కరుణానిధి సమాధి దగ్గరకు చేరుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.

మెరీనా బీచ్ లోని కరుణానిధి సమాధి దగ్గర నుంచి నేరుగా ఇంటికి చేరుకున్న ఎంకే. స్టాలిన్ తల్లి దయాళ్ అమ్మాళ్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఎంకే. స్టాలిన్ డీఎంకే పార్టీ నాయకులు, కార్యక్రమాలతో బిజీ అయ్యారు.
మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత స్టాలిన్ తల్లి దయాళ్ అమ్మాళ్ అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రి దగ్గర కరుణానిధి కుటుంబ సభ్యులు, డీఎంకే పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. బుధవారం దయాళ్ అమ్మాళ్ హెల్త్ బులిటెన్ ను అపోలో ఆసుపత్రి వర్గాలు విడుదల చేసే అవకాశం ఉందని డీఎంకే పార్టీ నేతలు అంటున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications