శశికళ పదవికి పన్నీరు చెక్: పార్టీ చీఫ్‌గా మధుసూదనన్, రెండ్రోజుల్లో చిన్నమ్మ పని క్లోజ్

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గురువారం నాడు పెద్ద షాక్ ఇచ్చారు.

చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గురువారం నాడు పెద్ద షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్న ఆమెను ఏకంగా పార్టీ చీఫ్ పదవి పక్కన పెట్టేశారనే చెప్పవచ్చు.

అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ ఈ రోజు పన్నీరు వర్గం వైపు వచ్చారు. ఈ సమయంలో పన్నీరు సెల్వం మాట్లాడారు. శశికళ పైన తీవ్రంగా విరుచుకు పడ్డారు. అంతేకాదు, మధుసూదన్‌ని పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు, అన్నాడీఎంకే సీనియర్ పీహెచ్ పాండియన్ కూడా శశికళ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.శశికళ పని రెండు రోజుల్లో క్లోజ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా శశికళకు చెక్ చెప్పే దిశగా పన్నీరు పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది.

శశకళపై నిప్పులు చెరిగిన పన్నీరు

శశకళపై నిప్పులు చెరిగిన పన్నీరు

శశికళ పైన పన్నీరు సెల్వం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. శశికళ ముఖ్యమంత్రి అయితే అది మాయని మచ్చ అవుతుందన్నారు. మధుసూదన్ తమ వైపు రావడం ఎంతో బలం అన్నారు. మధుసూదన్‌ను శశికళ వర్గం బెదిరించిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

శశికళ సీఎం అయితే మాయని మచ్చ

శశికళ సీఎం అయితే మాయని మచ్చ

శశికళ ముఖ్యమంత్రి అయితే ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ పన్నీరు సెల్వం అన్నారు. ఎవరు ఎన్ని డ్రామాలు ఆడుతున్నారో ప్రజలు చూస్తున్నారన్నారు. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని చెప్పారు.

అన్నీ బయటపెడతా.. డ్రామాలు ఎవరివో తెలుస్తోంది

అన్నీ బయటపెడతా.. డ్రామాలు ఎవరివో తెలుస్తోంది

తమ పైన ఆరోపణలు చేస్తున్న వారి అసలు రంగు బయటపెడతామని పన్నీరు సెల్వం అన్నారు. వేదనిలయాన్ని అమ్మ స్మారక స్థూపంగా చేస్తామని పునరుద్ఘాటించారు. ఎవరు ఎన్ని డ్రామాలు ఆడుతున్నారో ప్రజలకు తెలుసునని చెప్పారు.

జయకు శశికళ క్షమాపణ లేఖ చదివి వినిపించారు

జయకు శశికళ క్షమాపణ లేఖ చదివి వినిపించారు

తాను ఎలాంటి పరిస్థితుల్లో బాధ్యతలను చేపట్టానో ప్రజలకు తెలుసునని చెప్పారు. ఈ సందర్భంగా గతంలో శశికళ.. జయలలితను క్షమాపణ కోరుతూ రాసిన లేఖను పన్నీరు సెల్వం చదివి వినిపించారు. శశికళ చెప్పేవి అన్నీ అబద్దాలని వ్యాఖ్యానించారు.

మధుసూదన్ విమర్శలు

మధుసూదన్ విమర్శలు

అన్నాడీఎంకే పార్టీని ఎట్టి పరిస్థితుల్లో రౌడీల చేతిలోకి వెళ్లనీయమని అన్నాడీంకే ప్రిసిడీయం ఛైర్మన్‌ మధుసూదన్‌ అన్నారు. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వాన్ని కలిసి తన మద్దతు తెలిపారు. పన్నీరు సెల్వానికే తమ మద్దతు ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+