అసెంబ్లీ ఎన్నికలు: కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ సీఎం బావమరిది!
భోపాల్: కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్‌కు గట్టి షాక్ తగిలింది. చౌహాన్ బావమరిది సంజయ్ సింగ్ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మాజీ కేంద్రమంత్రి, పీసీసీ చీఫ్ కమల్ నాథ్, ప్రచార కమిటీ చీఫ్ జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో సంజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రాజరిక పాలనను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ రాష్ట్రంలో 230 నియోజకవర్గాలకు నవంబర్ 28న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు జరగనుంది.
కాగా, శివరాజ్ సింగ్ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం గట్టి ప్రయత్నమే చేస్తోంది. తామే అధికారంలోకి వస్తామంటూ ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications