వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం అల్లుడు అరెస్టు, రూ. 354 కోట్లు చీటింగ్ కేసు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అల్లుడు, ప్రముఖ వ్యాపారవేత్త రతుల్ పురిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకులకు సుమారు రూ. 354 కోట్లు మోసం (చీటింగ్ కేసు) చేశారని ఆరోపిస్తూ ఈడీ అధికారులు సీఎం కమల్ నాథ్ అల్లుడు రతుల్ పురి మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ స్యాంలో రతుల్ పురి పేరు వినిపిస్తోంది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అల్లుడు రతుల్ పురి మీద ఈడీ అధికారులు మనిల్యాండ్రింగ్ (PMLA)కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రతుల్ పురి మోసెర్ చేర్ సంస్థ మాజీ సీనియర్ అధికారి. మోసెర్ చేర్ కంపెనీ పేరుతో 2009 నుంచి వివిద బ్యాంకుల్లో రుణం తీసుకున్నారు.

Madhya Pradesh Chief Minister Kamal Naths nephew Ratul Puri arrested in loan fraud case

బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడానికి మోసెర్ చేర్ కంపెనీకి రతుల్ పురి సహకరించాడని ఆరోపణలు ఉన్నాయి. నకిలీ పత్రాలు సమర్పించి మోసెల్ చేర్ కంపెనీకి బ్యాంకుల్లో సుమారు రూ. 354 కోట్లు రుణం తీసుకున్నారని ఈడీ అధికారులు గుర్తించారు.

మోసెల్ చేర్ కంపెనీ నిర్వహకులు నకిలీ పత్రాలతో తమ బ్యాంకులో రుణం తీసుకుని మోసం చేశారని ప్రభుత్వ సెంట్రల్ బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 16వ తేదీన మోసెర్ చేర్ సంస్థకు చెందిన దీపక్ పురి, ఆయన తల్లి నీతా పురి నివాసం మీద సీబీఐ అధికారులు దాడి చేశారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం కేసులో రతుల్ పురి వినిపిస్తున్న విషయం తెలిసిందే.

English summary
Businessman Ratul Puri, nephew of Madhya Pradesh chief minister Kamal Nath, has been arrested by the Enforcement Directorate (ED).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X