Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

14 ఏళ్ల బాలికపై 8 నెలలుగా ఘోరం-స్నేహితులతో కలిసి కజిన్ గ్యాంగ్ రేప్-గర్భం దాల్చడంతో అబార్షన్

ఆ బాలిక వయసు 14 ఏళ్లు... తల్లి మూడేళ్ల క్రితమే చనిపోయింది... తండ్రి బతుకుదెరువు కోసం మరో ఊరిలో ఉంటున్నాడు... తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో ఆ బాలిక ఒంటరిగా ఉంటోంది... అప్పుడప్పుడు ఆమె ఇంటికెళ్లే కజిన్‌ ఒకానొక రోజు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు... అది అక్కడితో ఆగలేదు... ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి కొన్ని నెలలుగా బాలికపై అత్యాచారం చేశాడు... బాలిక గర్భం దాల్చి ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది... ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ బాలిక పుట్టిన బిడ్డను బావిలో విసిరేసింది.పోలీసులు బాలికను అదుపులోకి తీసుకుని విచారించడంతో.. ఆమెపై జరిగిన అత్యాచారకాండ వెలుగుచూసింది.

అసలేం జరిగింది..

అసలేం జరిగింది..

పోలీసుల కథనం ప్రకారం... మధ్యప్రదేశ్‌లోని భదోరియాకు చెందిన 14 ఏళ్ల బాలిక తల్లి మూడేళ్ల క్రితం చనిపోయింది.తండ్రి బతుకుదెరువు రీత్యా మరో చోట ఉంటున్నాడు.దీంతో గ్రామంలోని ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంటోంది.అప్పుడప్పుడు 21ఏళ్ల ఆమె కజిన్ ఇంటికి వస్తుండేవాడు.ఇదే క్రమంలో గతేడాది అక్టోబర్‌లో ఓరోజు బాలిక ఇంటికి వెళ్లిన అతను... ఆ సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన నలుగురు స్నేహితులతో కలిసి పలుమార్లు బాలికపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డాడు.

8నెలలుగా అత్యాచారం...

8నెలలుగా అత్యాచారం...

అక్టోబర్ 2020 నుంచి మే 2021 వరకు 8 నెలలుగా బాలిక కజిన్,అతని నలుగురు స్నేహితులు కలిసి బాలికపై తరచూ అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. తన బాధ చెప్పుకుందామన్నా ఎవరూ లేక ఆ బాలిక మౌనంగా ఇదంతా భరించింది. ఈ క్రమంలో ఓరోజు బాలికకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో తన కజిన్‌తో చెప్పింది. అతను గ్రామంలోని ఓ మంత్రసాని దగ్గరికి బాలికను తీసుకెళ్లాడు.బాలికను పరీక్షించిన ఆ మంత్రసాని గర్భవతి అని తేల్చింది.దీంతో బాలిక కజిన్ ఆమెకు అబార్షన్ మాత్రలు ఇచ్చాడు. దీంతో ఇంకా ఎదగని శిశువుకు ఆ బాలిక జన్మనిచ్చింది. అనంతరం ఇద్దరు కలిసి పుట్టిన బిడ్డను ఓ బావిలో విసిరేశారు.

ఇలా వెలుగులోకి

ఇలా వెలుగులోకి

బావిలో శిశువు మృతదేహంపై పోలీసులకు సమాచారం అందడంతో మొదట ఆ బాలికను అదుపులోకి తీసుకుని విచారించారు.దీంతో తనపై జరిగిన ఆకృత్యాలను బాలిక పోలీసులకు వెల్లడించింది.వెంటనే పోలీసులు ఆమె కజిన్‌తో పాటు అతని స్నేహితులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్ బాలురు ఉన్నట్లు గుర్తించారు. బాలికను జువైనల్ బోర్డు ముందు ప్రవేశపెట్టి... అనంతరం జువైనల్ హోమ్‌కు తరలించారు.ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

Recommended Video

    Why Love Story Is A Must Watch | Naga Chaitanya, Sai Pallavi కెరీర్ బెస్ట్ || Oneindia Telugu
    మైనర్ బాలికలపై అత్యాచారాల్లో టాప్‌లో మధ్యప్రదేశ్..

    మైనర్ బాలికలపై అత్యాచారాల్లో టాప్‌లో మధ్యప్రదేశ్..


    నేషనల్ క్రైమ్ బ్యూరో 2020 లెక్కల ప్రకారం... మహిళలపై నేరాల్లో ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,ఢిల్లీ,రాజస్తాన్,టాప్‌లో ఉన్నాయి. వరుసగా రెండో ఏడాది రాజస్తాన్ టాప్ లిస్టులో చేరింది. గతేడాది రాజస్తాన్‌లో 34,535,ఉత్తరప్రదేశ్‌లో 49,385,పశ్చిమ బెంగాల్‌లో 36,439 కేసులు నమోదయ్యాయి. అత్యాచార కేసుల్లో రాజస్తాన్ 5310 కేసులతో టాప్‌లో ఉన్నది. ఆ తర్వాతి స్థానంలో 2769 కేసులతో ఉత్తరప్రదేశ్ ఉంది.మైనర్ బాలికలపై అత్యాచారాల్లో మధ్యప్రదేశ్‌ టాప్‌లో ఉంది.గతేడాది మధ్యప్రదేశ్‌లో 3259 మంది మైనర్ బాలికలు అత్యాచారాలకు గురైనట్లుగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2785,ఉత్తరప్రదేశ్‌లో 2630 కేసులు నమోదయ్యాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యధికంగా ఢిల్లీలో గతేడాది 967 కేసులు నమోదయ్యాయి.ఆ తర్వాతి స్థానంలో 409 కేసులతో రాజస్తాన్ రాజధాని జైపూర్ నగరం ఉన్నది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+