వ్యామప్ స్కామ్: సీఎం సంభాషణ రహస్యంగా రికార్డు
ఇండోర్: మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కుదుపేసిన వ్యాపమ్ స్కామ్ రోజుకొక మలుపుతిరుగుతుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ శింగ్ చౌహాన్ వ్యాపమ్ స్కామ్ గురించి చర్చించిన సమయంలో రహస్యంగా రికార్డు చేశానని ఆ కుంభకోణం బయటపెట్టిన ఆనంద్ రాయ్ అంటున్నారు.
ఇప్పుడు కావాలనే ప్రభుత్వం తమ మీద కక్ష పెంచుకుని మా కుటుంబ సభ్యులను వేదిస్తున్నారని ఆనంద్ శర్మ ఆరోపిస్తున్నారు. వ్యామమ్ స్కామ్ ను ఆనంద్ రాయ్ బయటపెట్టారు. ఆగస్టు 11వ తేది రాత్రి ఆనంద్ శర్మ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఆయన అధికారిక నివాసంలో భేటి అయ్యారు.
రాత్రి 9.45 నుంచి 10.50 వరకు శివరాజ్ శింగ్ చౌహాన్, ఆనంద్ రాయ్ వ్యాపమ్ స్కామ్ గురించి చర్చించారు. ఆ సందర్బంలో తన చేతి గడియారంలోని కెమెరాలో ఆ సంభాషణలు రహస్యంగా రికార్డు చేశానని ఆనంద్ రాయ్ అంటున్నారు.

ప్రభుత్వం తన భేటిని రహస్యంగా రికార్డు చేసి వారికి పనికొచ్చే విషయాలు మాత్రం మీడియాకు విడుదల చేస్తుందనే ఉద్దేశంతోనే నేను ఈపనిచేశానని ఆనంద్ రాయ్ అంటున్నారు. అంతే కాని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి కాదని చెప్పారు.
ఆనంద్ రాయ్, ఆయన భార్య గౌరి రాయ్ డాక్టర్లు. శుక్రవారం వీరిద్దరిని ప్రభుత్వం ఇండోర్ నుంచి బదిలి చేసింది. అయితే కొన్ని గంటలలోనే వారిద్దరి బదిలీలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పరపతి ఉన్న మంత్రులు, బీజేపీ నేతల మీద తాను ఫిర్యాదు చేసినందు వలనే తమ మీద కక్ష సాధిస్తున్నారని ఆనంద్ రాయ్ ఆరోపించారు.
తన పేరు, తన కుటుంబ సభ్యుల పేర్లు బయటపెట్టరాదని షరతుతో శివరాజ్ సింగ్ చౌహాన్ తమ బదిలీ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారని ఆనంద్ రాయ్ అన్నారు. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటి అయిన సమయంలో రికార్డు చేసిన సంభాషణలు బయటపెట్టనని ఆనంద్ రాయ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications