విజయ్ బల పరీక్ష వేళ హైకోర్టు బిగ్ షాక్, వాట్ నెక్స్ట్...!!

తమిళనాడులో విజయ్ బల పరీక్ష వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ అసెంబ్లీలో తన సంఖ్యా బలం నిరూపించుకోవాల్సి ఉంది. గవర్నర్ ఇచ్చిన గడువు మేరకు రేపు (బుధవారం) అసెంబ్లీలో విజయ్ బల పరీక్షకు సిద్దమయ్యారు. విజయ్ కు ప్రభుత్వం ఏర్పాటు సమయంలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇప్పుడు సభలోనూ 118 కి తగ్గకుండా బలం నిరూపించుకోవాలి. అయితే, ఈ సమయంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆసక్తి కరంగా మారుతోంది.

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ ప్రభుత్వం బల పరీక్ష ఎదుర్కొంటోంది. అయిదు పార్టీల మద్దతుతో విజయ్ కూటమి సంఖ్యా బలం అసెంబ్లీలో 120గా ఉంది. సభా వేదికగా విజయ్ తన ప్రభుత్వ సంఖ్యా బలాన్ని నిరూపించుకోవాలి. కాగా.. టీవీకే నుంచి 108 మంది గెలవగా.. అందులో విజయ్ రెండో సీటుగా గెలిచిన తిరుచ్చి ఈస్ట్ కు రాజీనామా చేసారు. దీంతో.. టీవీకే బలం 107 కి చేరింది. తాజాగా తిరుపత్తూరు నియోజకవర్గంలో ఒక్క ఓటుతో టీవీకే ఎమ్మెల్యే గెలుపు వ్యవహారం కోర్టుకు చేరింది. శివగంగ జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గంలో తమిళగ వెట్రి కళగం అభ్యర్థి శ్రీనివాస సేతుపతి..డీఎంకే అభ్యర్ధి పెరియకరుప్పన్ పైన ఒక ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ ఫలితం పైన పెరియకరుప్పన్ కోర్టును ఆశ్రయించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అక్రమాలు జరిగాయని కోర్టుకు ఫిర్యాదు చేసారు. దీంతో.. విచారణ చేసిన కోర్టు టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి రేపు అసెంబ్లీలో జరిగే బల పరీక్షకు దూరంగా ఉండాలని టీవీకే ఎమ్మెల్యేను హైకోర్టు ఆదేశించింది.

 సీఎం విజయ్ చేతికి అన్నా డీఎంకే, బలపరీక్ష వేళ ఊహించని రాజకీయం..!!
సీఎం విజయ్ చేతికి అన్నా డీఎంకే, బలపరీక్ష వేళ ఊహించని రాజకీయం..!!
madras-high-court-division-bench-grants-interim-injunction-on-petitions-filed-by-dmks-periakaruppan

హైకోర్టు తాాజా ఆదేశాలతో

అయితే, అసెంబ్లీలో బల పరీక్ష లో విజయ్ సునాయాసంగా నెగ్గే అవకాశం కనిపిస్తోంది. 118 కంటే విజయ్ కు ఎక్కువ ఓట్లు దక్కే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో అన్నా డీఎంకే చీలిక వర్గం ఈ రోజు సాయంత్రం సీఎం విజయ్ ను కలవనుంది. రేపు అసెంబ్లీ లో జరిగే బల పరీక్ష కు అన్నా డీఎంకే చీలక వర్గం హాజరవుతుందా.. లేక, గైర్హాజరై పరోక్షంగా మద్దతు ఇస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఆ పార్టీలోని సీవీ షణ్ముగం వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి విజయ్‌ సారధ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK)కు మద్దతు ప్రకటించింది. ఆయన వర్గంలో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. వరుస ఓటముల కు పళనిస్వామే కారణమని విమర్శించారు. పార్టీ పదవి నుంచి ఆయన దిగిపోవాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+