వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివాజీ గణేషన్ విగ్రహంలో కరుణానిధి పేరు మాయం: తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు !

తమిళ చిత్రరంగంలో బహుముఖ ప్రజ్ఞ కలిగిన శివాజీ గణేశన్ విగ్రహంలో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి పేరు ఎందుకు తొలగించారో రెండు వారాల్లో చెప్పాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు నోట

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ చిత్రరంగంలో బహుముఖ ప్రజ్ఞ కలిగిన శివాజీ గణేశన్ విగ్రహంలో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి పేరు ఎందుకు తొలగించారో రెండు వారాల్లో చెప్పాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

చెన్నై నగరం సమీపంలోని వడపెరుంబాక్కానికి చెందిన డీఎంకే పార్టీ న్యాయవాది పి. కరుణానిధి దాఖలు చేసిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు విచారణకు స్వీకరించింది. శివాజీ గణేశన్ విగ్రహాన్ని మెరీనా బీచ్ తీరంలో ప్రతిష్టించారని, అక్కడ ట్రాఫిక్ ఇబ్బందుల కారణాలు తెలుపుతూ తొలగించారని పిటిషన్ లో వివరించారు.

Madras High Court issues noties to Tamil Nadu govt on Sivaji Ganesan staue row

శివాజీ గణేశన్ విగ్రహాన్ని అనంతరం శివాజీ గణేశన్ స్మారకమండపంలో ఏర్పాటు చేశారని పిటిషన్ లో తెలిపారు. శివాజీ గణేశన్ విగ్రహంలో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి పేరును రాజకీయ కారణాల వలన తొలగించారని పిటిషన్ లో పేర్కొన్నారు.

తమిళనాడు ప్రభుత్వం కావాలనే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి పేరును శివాజీ గణేశన్ విగ్రహం నుంచి తొలగించారని, అందులో మళ్లీ కరుణానిధి పేరును పొందుపరిచేందుకు ప్రభుత్వానికి ఉత్వర్వులు ఇవ్వాలని న్యాయవాది పిటిషన్ లో కొరారు.

పిటిషన్ విచారణకు స్వీకరించిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి రవిచంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి పేరును శివాజీ గణేశన్ విగ్రహం నుంచి ఎందుకు తొలగించారో రెండు వారాల్లో సంజాయిషీ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు అందజేసింది.

English summary
Madras High Court issued notice to Tamil Nadu government on a plea by a lawyer to replace a stone plaque that has former Chief Minister M Karunanidhi's name, in the statue of legendary actor, late Sivaji Ganesan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X