Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భావప్రకటనా స్వేచ్ఛ విద్వేషంగా మారొద్దు-ఉదయనిధి సనాతన వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు...

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా చల్లారడం లేదు. ఉదయనిధి కామెంట్స్ తర్వాత సనాతన ధర్మంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మద్రాసు హైకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. సనాతన ధర్మం అనేది దేశానికి, రాజుకు, తల్లిదండ్రులకు, గురువులకు, పేదల పట్ల శ్రద్ధతో సహా శాశ్వతమైన విధి అని వ్యాఖ్యానించింది.

'సనాతన వ్యతిరేకత' అనే అంశంపై విద్యార్థులు తమ ఆలోచనలను పంచుకోవాలని తమిళనాడులోని స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ ఇళంగోవన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎన్ శేషసాయి కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం కేవలం కులతత్వం, అంటరానితనాన్ని ప్రోత్సహించడమేనని జరుగుతన్న ప్రచారంపై స్పందిస్తూ దీన్ని తిప్పికొట్టాలన్నారు. సమాన పౌరులున్న దేశంలో అంటరానితనాన్ని సహించలేమని జస్టిస్ శేషసాయి పేర్కొన్నారు.

https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-minister-dl-ravindra-reddy-repentance-on-voting-ys-jagan-key-comments-on-chandrababu-arrest-355891.html

"సనాతన ధర్మం' ఆదేశ సూత్రాలలో ఎక్కడో అనుమతించబడినట్లు చూసినా... రాజ్యాంగంలోని 17వ అధికరణ అంటరానితనం నిర్మూలించబడిందని ప్రకటించినందున దానికి ప్రస్తుతం చోటు లేదన్నారు. వాక్ స్వాతంత్య్రం ప్రాథమిక హక్కు అయితే, అది ద్వేషపూరిత ప్రసంగంగా మారకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి మతపరమైన అంశాలకు సంబంధించినప్పుడు న్యాయమూర్తి దీన్ని పేర్కొన్నారు. ఇలాంటి ప్రసంగం వల్ల ఎవరూ గాయపడకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని ఆయన వెల్లడించారు.

ప్రతి మతం విశ్వాసం ఆధారంగా ఏర్పడిందని, దాని స్వభావం ద్వారా విశ్వాసం అహేతుకతను కలిగి ఉంటుందన్నారు. కాబట్టి, మతానికి సంబంధించిన విషయాలలో వాక్ స్వేచ్ఛను ఉపయోగించినప్పుడు, ఎవరూ గాయపడకుండా చూసుకోవడం అవసరమన్నారు. మరో మాటలో చెప్పాలంటే ప్రసంగం ద్వేషపూరిత ప్రసంగం కాదన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+