బీజేపీకి షాక్: పశుమాంస నిషేధంపై మద్రాస్ హైకోర్టు 'స్టే'..

నాలుగు వారాల పాటు కోర్టు స్టే విధిస్తున్నట్లు తెలిపింది. ఆలోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇచ్చుకోవాలని మధురై బెంచ్ పేర్కొంది.

చెన్నై: కేంద్రం తీసుకొచ్చిన గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. తమిళనాడుకు చెందిన కొంతమంది వ్యక్తులు దీనిపై హైకోర్టును ఆశ్రయించగా.. నాలుగు వారాల పాటు కోర్టు స్టే విధిస్తున్నట్లు తెలిపింది. ఆలోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇచ్చుకోవాలని మధురై బెంచ్ పేర్కొంది.

ఇప్పటికే కేరళ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో గోమాంస నిషేధంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దానికి తోడు కేంద్రం తీసుకొచ్చిన చట్టం కూడా గందరగోళపరిచే విధంగా ఉందన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రాల పరిధిలోని అంశంపై జోక్యం చేసుకోవడమే కాక, ఓవైపు సమైక్య స్ఫూర్తికి విఘాతం కలగదనే చెబుతూనే ఇలాంటి చట్టాలు అమలు చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Madras High Court stays Centre’s order on cattle slaughter

మరోవైపు కబేళాల నిషేధంతో మాంస పరిశ్రమలతో పాటు చర్మ సంబంధిత పరిశ్రమలపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. మరోవైపు భారతీయులు ఏం తినాలన్న విషయాన్ని నరేంద్ర మోదీ సర్కారు చెబుతుండటం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్య వ్యతిరేకమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు.

తమ ప్రభుత్వం భారత వ్యవస్థను దెబ్బతీసి, ప్రజల మధ్య అంతరాలను పెంచే ఈ తరహా నిర్ణయాలను అంగీకరించబోదని, వాటిని పాటించాల్సిన అవసరం కూడా లేదని మమతా అన్నారు. పశుమాంసంపై చట్టపరమైన పోరాటం చేసేందుకు సెక్యులర్ పార్టీలన్ని కలిసిరావాలని కోరారు. ప్రజాస్వామ్యంతో మోడీ ప్రభుత్వం ఆటలాడుకుంటోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+