ప్రముఖ పంజాబీ ఇన్‌ ఫ్లుయెన్సర్ ను నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు

పంజాబ్ కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్, మేకప్ ఆర్టిస్ట్ మ్యాడ్ సంధు దారుణ హత్యకు గురయ్యాడు. అమృత్ సర్ లోని లోహర్కా రోడ్ లో ఇవాళ సాయంత్రం బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు నడిరోడ్డుపై అతడ్ని తుపాకీతో కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కాల్పుల్లో రెండు బుల్లెట్లు తగిలి సంధు తీవ్ర గాయాలపాలవ్వగా వెంటనే అతడ్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఇక ఈ ఘటన జరిగిన వెంటనే స్పాట్ కు చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. అయితే సంధు పోస్ట్ చేస్తున్న కంటెంట్ యువతను తప్పుదారి పట్టిస్తోందంటూ.. జులైలో నిహాంగ్ సిక్కులు అతడ్ని హెచ్చరించినట్లు సమాచారం.

ఇక ఈ ఘటనపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రభ్ జోత్ సింగ్ విర్క్ మాట్లాడుతూ.. సంధు శరీరంలోకి రెండు బుల్లెట్ లు దిగాయని అన్నారు. అతడి మరణాన్ని ధ్రువీకరించామని తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. " మా టీమ్ లు ఇప్పటికే ఈ ఘటనపై దర్యాప్తును చేపట్టాయి. అలాగే మాకు కొన్ని ప్రముఖ లీడ్స్ వచ్చాయి" అని పోలీస్ అధికారులు తెలిపారు. అలాగే హత్య జరిగిన ప్రదేశం నుంచి రెండు బుల్లెట్స్ ను రికవరీ చేశామన్నారు. ఈ కాల్పులకు గల కారణాలు, ఘటనకు దారి తీసిన పరిస్థితుల గురించి ఇప్పటి వరకు క్లారిటీ లేదని త్వరలోనే నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

MadSandhu Famous Punjabi influencer brutally murdered gangster Goldy Dhillon takes responsibility

ఇదే సమయంలో గ్యాంగ్ స్టర్ గోల్డీ థిల్లాన్ కు చెందిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ పోస్టులో థిల్లాన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జనరేషన్ ను సంధు తన పోస్టులతో తప్పుదోవ పట్టిస్తున్నాడని తెలిపాడు. అయితే ఈ మర్డర్ లో గ్యాంగ్ స్టర్ గోల్డీ థిల్లాన్ హస్తం ఉందని పోలీసులు ఇంకా నిర్థారించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+