క్రికెట్ గొడవ: ప్రత్యర్థులు విద్యార్థిని కొట్టి చంపారు

తమిళనాడులోని మదురై శివారులో గల ఓ ప్రైవేట్ కాలేజీలో సూర్య బికాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. విద్యార్థులు ఆదివారంనాడు సాయంత్రం క్రికెట్ ఆడారని, ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య గొడవ జరిగిందని పోలీసులు చెప్పారు. ఇతరులు జోక్యం చేసుకోవడంతో విద్యార్థులు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
కొన్ని గంటల తర్వాత ఓ ముఠా సూర్యను అరసమారుతు ఊరాని వద్ద పట్టుకుని అతనిపై మారణాయుధులతో దాడి చేశారు. దాంతో సూర్య తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. సూర్యపై దాడి చేసింది విద్యార్థులు కాదని, ఏడుగురి కన్నా ఎక్కువ మంది ఈ దాడిలో పాల్గొన్నారని పోలీసులు అంటున్నారు. వారికోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications