వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూనివర్శిటీ క్యాంపస్ లో లేడీ ప్రోఫెసర్ మీద 15 సార్లు కత్తితో దాడి: దర్జాగా అక్కడే !

ఉద్యోగం ఊడిపోవడానికి కారణం అయ్యారనే కక్షతో మహిళా ప్రోఫెసర్ ను యూనివర్శిటీ క్యాంపస్ లో అతిదారుణంగా కత్తితో పొడిచిన ఘటన తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్శిటీలో జరిగింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఉద్యోగం ఊడిపోవడానికి కారణం అయ్యారనే కక్షతో మహిళా ప్రోఫెసర్ ను యూనివర్శిటీ క్యాంపస్ లో అతిదారుణంగా కత్తితో పొడిచిన ఘటన తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్శిటీలో జరిగింది. మదురై కామరాజ్ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రోఫెసర్ గా ఉద్యోగం చేస్తున్న ఎస్. జెనీఫా అనే మహిళపై హత్యాయత్నం జరిగింది.

మదురై యూనివర్శిటీలోని జర్నలిజం అండ్ సైన్స్ కమ్యూనికేషన్ విభాగం అధిపతిగా (హెడ్ఆఫ్ ది డిపార్ట్ మెంట్)గా జెనీఫా ఉద్యోగం చేస్తున్నారు. ఇదే కాలేజ్ లో గత సంవత్సరం పార్ట్ టైం లెక్చరర్ గా ఉద్యోగం చేసిన జ్యోతి మురుగన్ (32) అనే వ్యక్తి మంగళవారం 15 సార్లు కత్తితో పోడిచి జెనీఫాను అతి దారుణంగా హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు.

లెక్చరర్ ఉద్యోగం

లెక్చరర్ ఉద్యోగం

2016-17 విధ్యాసంవత్సరంలో జ్యోతి మురుగన్ మదురై కామరాజ్ యూనివర్శిటీలో పార్ట్ టైం లెక్సరర్ గా ఉద్యోగం చేసి విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. 2017-18 విధ్యాసంవత్సరంలో జ్యోతి మురుగన్ ను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోలేదు. అతన్ని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవడానికి జెనీఫా నిరాకరించారని తెలిసింది.

 మూడు నెలల నుంచి వస్తున్నాడు

మూడు నెలల నుంచి వస్తున్నాడు

గత మూడు నెలల నుంచి అప్పుడప్పుడు జ్యోతి మురుగన్ యూనివర్శిటీ క్యాంపస్ కు వచ్చి జెనీఫాను ఆమె చాంబర్ లో కలిసి తనకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పాడని తెలిసింది. జెనీఫాను బెదిరించిన సందర్బాలు ఉన్నాయని తెలిసింది. అయితే ఆమె అతన్ని ఉద్యోగంలోకి తీసుకోలేదు.

చాంబర్ దగ్గర వెయిట్ చేశాడు

చాంబర్ దగ్గర వెయిట్ చేశాడు

మంగళవారం జ్యోతి మురుగన్ మదురై కామరాజ్ యూనివర్శిటీకి వెళ్లాడు. తరువాత జెనీఫా చాంబర్ దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో జెనీఫా చాంబర్ నుంచి బయటకు వెళ్లారని తెలిసింది. కొంత సేపటి తరువాత జెనీఫా చాంబర్ లోకి వెళ్లారు.

15 సార్తు కత్తితో దాడి

15 సార్తు కత్తితో దాడి

ఆ సమయంలో చాంబర్ లో జెనీఫాతో గొడవ పెట్టుకున్న జ్యోతి మురుగన్ ముందుగా వెంట తీసుకు వెళ్లిన కత్తి తీసుకుని జెనీఫా మీద ఇష్టం వచ్చినట్లు పోడిచాడు. జెనీఫా కడుపు, చాతి, మెడ వెన్ను తదితర భాగాల్లో 15 సార్లు కత్తితో పొడవడంతో ఆమె గట్టిగా కేకలు వేసి కుప్పకూలిపోయారు.

మృత్యువుతో పోరాటం

మృత్యువుతో పోరాటం

యూనివర్శిటీ సిబ్బంది, విద్మార్థులు వెంటనే స్థానిక ఆసుపత్రిలో జెనీఫాకు ప్రథమ చికిత్స చేయించి అనంతరం మదురై నగరంలోని నాగమలై ఆసుపత్రికి తరలించారు. జెనీఫా చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాటం చేస్తున్నారని పోలీసులు చెప్పారు. గతంలో జెనీఫాకు ప్రాణహాని ఉన్నట్లు వెలుగు చూడలేదని, ఉద్యోగం పోయిందని కసితోనే జ్యోతి మురుగన్ హత్య చేశాడని, అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
A woman lecturer attacked at the classrom of Madurai Kamarajar university by the collegaue who lost job, attacked lecturer hospitalised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X