చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు

బెంగళూరు: కాంగ్రెస్ నాయకుల మద్య విభేదాలు రావడంతో చెప్పులతో కొట్టుకున్న సంఘటన బెంగళూరు నగర శివార్లలోని మాగడి తాలుకా పంచాయితీ కార్యాలయంలో జరిగింది. కాంగ్రెస్ నాయకుల తీరుతో ఆ పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారు.

మాగడి తాలుకా పంచాయితీ సభ్యుల సర్వసభ్య సమావేశం ఎర్పాటు చేశారు. అయితే కోరం లేకపోవడంతో సభను వాయిదా వేస్తున్నామని పంచాయితీ శాఖ సీనియర్ అధికారి ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో ఆరు మంది జేడీఎస్ సభ్యులు సమావేశంలో పాల్గోన్నారు.

 Magadi taluk panchayat members meeting in Karnataka

సర్వసభ్య సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ లోని ఓ వర్గానికి చెందిన 12 మంది సభ్యులు పట్టుబట్టారు. అయితే తాలుకా పంచాయితీ అధ్యక్షురాలు నిర్మలా సీతారాం సమావేశం నిర్వహించమని తేల్చి చెప్పారు. మీరు సమావేశం నిర్వహించకుంటే రాజీనామ చేసి వెళ్లాలని సోంత పార్టీకి (కాంగ్రెస్) చెందిన సభ్యులు డిమాండ్ చేశారు.

ఆ సందర్బంలో కాంగ్రెస్ లోని రెండు వర్గాల నాయకులు పరస్పరం అమ్మనాబూతులు తిట్టుకున్నారు. తరువాత చెప్పులు తీసుకుని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. అంతవరకు ఓపికగా ఉన్న పంచాయితీ శాఖ అధికారులు సమావేశ మందిరం నుంచి కాంగ్రెస్ సభ్యులను బయటకు పంపించారు. తరువాత పోలీసులు రంగప్రవేశం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+