చైనాతో విభేధాలపై కేంద్రం ప్రకటన - సంక్షోభం ముదిరింది - చర్చలకే ప్రాధాన్యం: ఫారిన్ సెక్రటరీ ష్రింగ్ల
గడిచిన నాలుగు నెలలుగా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. చైనాతో విభేదాలపై మోదీ సర్కార్ తొలిసారి అనూహ్య ప్రకటన చేసింది. డ్రాగన్ హద్దుమీరి ప్రవర్తిస్తున్నదని, సంక్షోభం తారాస్థాయికి చేరిందని తెలిపింది. ఇన్నాళ్లూ చైనా చర్యలను ఉపేక్షిస్తున్నట్లుగా వెలువడిన ప్రకటనలకు విరుద్ధంగా.. శుక్రవారం నాటి ప్రెస్ మీట్ లో విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా అనూహ్య వ్యాఖ్యలు చేశారు.
''ప్రస్తుతం చైనాతో సంక్షోభం బాగా ముదిరింది. సరిహద్దులో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. 1962 యుద్ధం తర్వాత ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాలేదు. 40 ఏళ్లలో లేని విధంగా, తొలిసారి మనం 20 మంది జవాన్లను పోగొట్టుకున్నాం. జరగని సైనికుల జీవితాలను మేము మొదటిసారిగా కోల్పోయాం'' అని ష్రింగ్లా అన్నారు.

పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నది భారత్ విధానమని, ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని, ఆసియాన్ బలోపేతం కావలన్నది తమ అభిమతమని, అంతమాత్రాన దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా వ్యాఖ్యానించారు.
Recommended Video
కాగా, చైనాతో విభేదాలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తున్నదని, బాధ్యత కలిగిన దేశం కాబట్టే మిలటరీ స్థాయిలో, దౌత్య స్థాయిలో చర్చలు కొనసాగిస్తూనే ఉంటామమని ష్రింగ్లా స్పష్టం చేశారు. చైనాతో ఉద్రిక్తతల్లో తీవ్రత ఉన్నప్పటికీ.. సవాళ్లను ఎదుర్కోవడం భారత్ కు కొత్తేమీ కాదని, ఎల్ఏసీ వెంబడి ఏప్రిల్ నాటి యథాతథ పరిస్థితి ఉండాలన్నదే భారత్ అభిమతమని విదేశాంగ శాఖ కార్యదర్శి అన్నారు.












Click it and Unblock the Notifications