Maha KumbhMela: ఆ దేశాల జనాభాను దాటిన పుణ్యస్నానాలు
Mahakumbh Mela: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా మరో రికార్డు సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 13న మహా కుంభమేళా మొదలైనప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు త్రివేణి సంగమంలో 50 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక తీర్థయాత్ర, సాంస్కృతిక సామాజిక కార్యక్రమం. ఇప్పటికే 50 కోట్లకుపైగా భక్తులు మహా కుంభమేళాల పుణ్యస్నానాలు చేశారని తెలిపింది. భారత్, చైనాలు మినహా మిగితా జనాభా కంటే ఈ సంఖ్యే ఎక్కువ కావడం గమనార్హం. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్ పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల జనాభా కూడా 50 కోట్ల కంటే తక్కువే అని యూపీ ప్రభుత్వం పేర్కొంది.

సతీసమేతంగా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పుణ్యస్నానాలు
ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యుమునా, సరస్వతీ నదుల సంగమ స్థానంలో శుక్రవారం ఒక్కరోజే 92 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ సర్కారు వెల్లడించింది. కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, తన సతీమణి అమృతా ఫడణవీస్, కుమార్తె దివిజలతో కలిసి శుక్రవారం రోజు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. మహాకుంభ మేళాలో భక్తుల కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశారని దేవేంద్ర ఫడణవీస్ ప్రశంసించారు. ఇందుకుగానూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆయన అభినందనలు తెలిపారు.
सनातन गर्व
— Mahakumbh (@MahaKumbh_2025) February 14, 2025
महाकुम्भ पर्व
विश्व के हर कोने से आये श्रद्धालुओं ने महाकुम्भ में स्नान किया और यह संख्या 50 करोड़ के पार पहुँच गयी है। इस संख्या ने लोगों में सनातन के प्रति आस्था और विश्व में सनातन की धाक को पुनः प्रमाणित कर दिया है।#सनातन_गर्व_महाकुम्भ_पर्व pic.twitter.com/OaDpgIkKlc
144 ఏళ్ల తర్వాత ఈ ఏడాది జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మొత్తం 40 నుంచి 50 కోట్ల మంది భక్తులు రావచ్చని మొదట అంచనా వేసినప్పటికీ.. అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు. మనదేశం నలుమూలల నుంచే గాక, ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుండటం గమనార్హం. ప్రతి రోజు దాదాపు కోటి మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుండటం గమనార్హం.
జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక, మరో 12 రోజులపాటు మహా కుంభమేళా జరగనుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్‌కు తరలివచ్చే అవకాశం ఉంది. మరోవైపు, మహా కుంభమేళాపై అసత్య ప్రచారాలు చేస్తున్నవారిపై యూపీ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తే కటకటాలు లెక్కిస్తారని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications