వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా ట్విస్ట్ వెనక: మోడీతో శరద్ పవార్ భేటీ కారణమా..? సమీకరణాలు ఎలా మారాయి...?

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్ నెలకొంది. మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవీ చేపట్టారు. దీంతో శివసేనకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంకయిపోయింది. ఇవాళ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చిద్దామనుకునేలోపు కమలదళం ఊహించని షాక్ ఇచ్చింది. ఎన్సీపీ తన వైఖరి మార్చుకోని-- శివసేన, కాంగ్రెస్ పార్టీలకు ఊహించని షాక్ ఇచ్చింది.

మహా ట్విస్ట్: సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీగా అజిత్ పవార్మహా ట్విస్ట్: సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీగా అజిత్ పవార్

మోడీ-పవార్ భేటీ

మోడీ-పవార్ భేటీ

ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఎన్సీపీ చీఫ్ శదర్ పవార్ సమావేశమయ్యారు. పైకి రైతు సమస్యలు, పెట్టుబడి సాయం అంటూ చెప్పినా.. అంతర్గతంగా మాత్రం మహారాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. భేటీలోనే మోడీ-పవార్ మధ్య ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చలు జరిగినట్టు సమాచారం. ఫడ్నవీస్ సీఎంగా, డిప్యూటీగా అజిత్ పవార్... మంత్రి పదవులు, ఇతర అంశాలపై చర్చించినట్టు సమాచారం.

పైకి ఇలా.. లోలోన అలా..

పైకి ఇలా.. లోలోన అలా..

ప్రభుత్వ ఏర్పాటు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై స్పష్టత రావడంతో పవార్ బీజేపీతో దోస్తికి సై అన్నట్టు తెలిసింది. తర్వాత సోనియాతో సమావేశమైన సీఎంపీ గురించి చర్చించి.. ఏమీ తెలియనట్టే ఉన్నారు. బయటకొచ్చాక మాత్రం మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు గురించి కాదని పేర్కొన్నారు. దీంతో హుటహుటిన శివసేన నేత సంజయ్ రౌత్ పవార్‌ను కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పవార్‌ను అర్థం చేసుకోవాంటే వంద జన్మలు ఎత్తాలి అని మాట్లాడిన సంగతి తెలిసిందే.

కొన్ని గంటల ముందు

కొన్ని గంటల ముందు

ప్రభుత్వ ఏర్పాటు గురించి శివసేన ఏర్పాట్లు చేస్తుండగా.. బీజేపీతో చేతులు కలిపిన పవార్.. గుమ్ముగా ఉన్నారు. ఇవాళ గవర్నర్‌తో సమావేశమవుతున్న నేపథ్యంలో ముందుగానే ప్రమాణం చేసి షాకిచ్చారు. బీజేపీకి పవార్ సపోర్ట్ చేయడంతో శివసేనకు ఎలాగైనా బుద్ది చెప్పాలని కమలదళం భావించింది. అదేవిధంగా ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో శివసేన, కాంగ్రెస్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాయి.

Recommended Video

Devendra Fadnavis Takes Oath As Maharashtra CM || డిప్యూటీగా అజిత్ పవార్
పవార్ పవర్ ఇది

పవార్ పవర్ ఇది

శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ నుంచి బీజేపీ-శివసేనకు సమీకరణాలు మారిపోయాయి. ఇందుకు రాజకీయ కురువృద్ధుడు పవార్..మోడీతో స్నేహ హస్తం అందించడమే కారణం. వైరి వర్గం శివసేనతో దోస్తి ఇష్టం లేకపోవడంతోనే.. బీజేపీ పక్కన చేరినట్టు తెలుస్తోంది. అందుకే నమ్మించి.. అదనుచూసి దెబ్బకొట్టారు.

English summary
maha twist behind: sharad pawar met prime minister narendra modi, discuss government formation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X