30న కర్ణాటక బంద్: తెలుగు ప్రయాణికులకు ఇబ్బందే!

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: మహాదాయి వాటర్ ట్రిబ్యూనల్ తీర్పు తమ రాష్ట్రానికి వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో ప్రో కన్నడ సంస్థలు, కన్నడ సినీ పరిశ్రమ జులై 30న కర్ణాటక రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. కర్ణాటక రాష్ట్రానికి 7.5టీఎంసీల నీళ్లను విడుదల చేసేందుకు వేసిన మధ్యంతర పిటిషన్‌ను ట్రిబ్యూనల్ తిరస్కరించిన కారణంగా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

ప్రో కన్నడ సంస్థలకు చెందిన కన్నడ ఒక్కూటా, కన్నడ చలువాలి వటల్ పక్ష నాయకుడు వటల్ నాగరాజు కర్ణాటక రాష్ట్ర బంద్‌కు సహకరించి, విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల న్యాయమైన డిమాండ్ కోసం శనివారం(జులై 30) బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇందు కోసం ఆందోళనలు ప్రారంభించినట్లు చెప్పారు.

'కర్ణాటకకు అన్యాయం జరిగిన క్రమంలో మేము ఓపిగ్గా కూర్చోలేము. రాజధానితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రజలందరూ వేదికలు ఏర్పాటు చేసుకుని నిరసనలు చేపట్టాలి. గోవా, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల దిష్టిబొమ్మలను తగలబెడ్తాం' అని ఆయన తెలిపారు.

Mahadayi row: Karnataka bandh on Saturday

'శుక్రవారం కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతినిధుల్లా మాక్ పార్లమెంటు నిర్వహిస్తాం. న్యూఢిల్లీలో కర్ణాటక నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారు కర్ణాటక కోసం తమ గొంతును వినిపించలేని కారణంగానే ఈ మాక్ పార్లమెంటు' అని నాగరాజు చెప్పారు.

కాగా, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సారా గోవిందు మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజల కోసం చేస్తున్న బంద్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. ఉత్తర కర్ణాటక రైతుల కోసం సినీ పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాలను ఆరోజు నిలిపివేస్తామని తెలిపారు.

కర్ణాటక బంద్ నేపథ్యంలో ప్రభుత్వ వాహనాలు రోడ్డుపైకి వచ్చే అవకాశం లేదు. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు కూడా తిరగడం కష్టమే. శనివారం బంద్ కారణంగా కర్ణాటకతోపాటు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే మంచిది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In the wake of the Mahadayi water+ tribunal verdict going against Karnataka, pro-Kannada organisations and the Kannada film industry called for a Karnataka bandh on Saturday, July 30, 2016.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X