బెంగళూరు బంద్, రాజకీయ వాసన, మా మద్దతు లేదు, మోడీ బహిరంగ సభ: ఫలితం!
బెంగళూరు: ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం నిర్వహించనున్న బెంగళూరు బంద్ కు మా మాద్దతు లేదని మహాదాయి నదీనీటి పంపిణి పోరాట సమితి స్పష్టం చేసింది. రాజకీయ దురుద్దేశంతో నిర్వహించే బంద్ కు మా మద్దతు ఎప్పుడూ ఉండదని మహాదాయి నదినీటి పంపిణి పోరాట సమితి అధ్యక్షుడు వీరేష్ సోబరదమఠ స్పష్టం చేశారు. ఈ దెబ్బతో ఫిబ్రవరి 4వ తేదీ బెంగళూరు బంద్ పిలుపుకు వెనకడుగు పడింది. అదే రోజు బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు.

కన్నడ సంఘాలు
మహాదాయి నదీనీటి పంపిణి విషయంలో గోవా ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆరోపిస్తూ ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం బెంగళూరు బంద్ కు వాటల్ నాగరాజ్ నేతృత్వంలోని కన్నడ సంఘాలు పిలుపునిచ్చారు. బెంగళూరు బంద్ చేసి కేంద్ర ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చెయ్యాలని నిర్ణయించారు.
Recommended Video


రాజకీయ వాసన
ఫిబ్రవరి 4వ తేదీ ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులో నిర్వహించనున్న బీజేపీ పరివర్తనా యాత్ర బహిరంగ సభలో పాల్టొనాలని ఎప్పుడో నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్బంలో కావాలనే బంద్ నిర్వహించాలని కొందరు నిర్ణయించారని, రాజకీయ వాసన వస్తున్న సందర్బంగా మా మద్దతు ఉండదని మహాదాయి నదీనీటి పంపిణి పోరాట సమితి తేల్చి చెప్పింది.

కర్ణాటక రక్షణా వేదిక
ప్రధాన నరేంద్ర మోడీ పర్యటన సందర్బంగా నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చెయ్యాలని కర్ణాటక రక్షణా వేదిక అధక్ష్యుడు టీఏ. నారాయణగౌడ ఇప్పటికే పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చెయ్యాలని నారాయణగౌడ పిలుపునిచ్చారు.

ఐదు జిల్లాల్లో పోరాటం
మహాదాయి నదీనీటి పంపిణి విషయంలో ఉత్తర కర్ణాటకలోని ఐదు జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇటీవల డిసెంబర్ 25వ తేదీ మహాదాయి నీటి పంపిణి విషయంలో గోవా ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తూ కర్ణాటక బంద్ నిర్వహించారు.

ఎన్నికల్లో బుద్ది చెబుతాం
ఐదు నెలల్లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో మహాదాయి నదీనీటి పంపిణి విషయంలో రాజకీయం చేస్తున్న వారికి తగిన బుద్ది చెబుతామని పోరాట సమితి అధ్యక్షుడు వీరేష్ సోబరదమఠ హెచ్చరించారు. రాజకీయాలను రాజకీయంగానే తాము దెబ్బకొడతామని విరేష్ సోబరదమఠ అన్నారు.

బంద్ తో ప్రయోజనం శూన్యం
బెంగళూరు బంద్ కారణంగా మహాదాయి నదీనీటి పంపిణి విషయం పరిష్కారం కాదని తెలిసే తాము మద్దతు ఇవ్వడం లేదని పోరాట సమితి అధ్యక్షుడు విరేష్ సోబరదమఠ చెప్పారు. ఈ దెబ్బతో ఫిబ్రవరి 4వ తేదీ బెంగళూరు బంద్ ను వాయిదా వెయ్యాలని కన్నడ సంఘాలు ఆలోచిస్తున్నాయి.

అమిత్ షా దెబ్బ
జనవరి 25వ తేదీన కర్ణాటక బంద్ నిర్వహించిన విషయం తెలిసిందే. అదే రోజు మైసూరులో జరిగిన బీజేపీ పరివర్తనా యాత్ర బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. అమిత్ షా కార్యక్రమం ఉందనే సీఎం సిద్దరామయ్య బంద్ కు మద్దతు ప్రకటించారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ రోజు కావాలనే బెంగళూరు బంద్ చేయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications