Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యోగి నోట తొక్కిసలాటకు అసలు కారణం

Mahakumbh 2025 stampede: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభ మేళా 2025లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. దీన్ని ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు.

40 మందికి పైగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు.

Mahakumbh 2025 stampede situation in Prayagraj is under control says CM Yogi Adityanath

త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద అర్ధరాత్రి దాటిన తరువాత ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక్కడి ఘాట్ల వద్దకు వెళ్లే మార్గం మొత్తం భీతావహంగా కనిపించింది. బ్యారికేడ్లన్నీ ఎక్కడికక్కడ పడిపోయి కనిపించాయి. తొక్కిసలాట చోటు చేసుకున్న వెంటనే అధికార యంత్రాంగం శరవేగంగా స్పందించింది. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్సుల్లో మోతీలాల్ నెహ్రూ ఆసుపత్రికి తరలించింది.

ఈ ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద అమృత్, పుణ్య స్నానాలు చేయడానికి వెళ్లే ప్రయత్నం చేయొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇతర ఘాట్ల వద్ద స్నానం ఆచరించడానికి అనువైన ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు.

త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, వేల సంఖ్యలో భక్తులు అక్కడికే వెళ్లడం వల్ల ఈ చర్యలకు ఆటంకం కలుగుతుందని యోగి ఆదిత్యనాథ్ వివరించారు. తమకు దగ్గరగా ఉన్న ఘాట్ల వద్దకు వెళ్లాలని కోరారు. సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పుకార్లను పట్టించుకోవద్దని కోరారు.

స్నానాలను ఆచరించడానికి భక్తులు ఒక్కసారిగా నోస్ పాయింట్ వద్దకు వెళ్లడానికి ప్రయత్నించడం వల్లే తొక్కిసలాట చోటు చేసుకుందని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పేర్కొన్నారు. ఎలాంటి వదంతులను విశ్వసించవద్దని, దీనివల్ల మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంటుందని అన్నారు.

అఖాడా మార్గంలో బ్యారికేడ్లను దాటడానికి ప్రయత్నించినప్పుడు తొక్కిసలాట జరిగిందని, కొందరు భక్తులు గాయపడ్డారని ఆయన వివరించారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించామని, అత్యుత్తమ వైద్య సహాయాన్ని అందిస్తోన్నామని అన్నారు. తొక్కిసలాటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆరా తీశారని వివరించారు.

ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో 8 నుంచి 10 కోట్లమంది భక్తులు ఉన్నారని, వారందరికీ పుణ్యస్నానాలను ఆచరించే అవకాశం కల్పిస్తామని యోగి హామీ ఇచ్చారు. నోస్ పాయింట్ మార్గ్, సంగం మార్గ్, అఖారా మార్గ్, నాగ వాసుకి మార్గంలో భక్తుల రద్దీ అధికంగా ఉందని, ప్రత్యామ్నాయ ఘాట్లల్లో భక్తులు పుణ్యస్నానాలను ఆచరించాలని కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+