Mahakumbh mela 2025 : పవిత్ర స్నానాల తేదీలు, ప్రాముఖ్యత..!!

మహాకుంభ మేళాకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 45 కోట్ల మంది భక్తులు హాజరయ్యే ఈ భారీ కార్యక్రమం కోసం సుమారు రూ 7500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. భక్తుల కోసం యూపీ ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. కుంభ సమయంలో పవిత్ర నదులలో స్నానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అదే విధంగా ఈ కుంభమేళా సమయంలో ఏ రోజున ఈ స్నానాలు చేయాలి.. వాటి ప్రత్యేకతలను సాదువులు వివరిస్తున్నారు. జనవరి 13న మాష్ పూర్ణిమ స్నానం తో మొదలై.. మహాశివరాత్రి తో కుంభమేళా ముగుస్తుంది.

ఆ ఆరు రోజులకు ప్రాధాన్యత
ఈనెల 13వ తేదీ పౌర్ణమి తిథి నుంచి 26 ఫిబ్రవరి మహాశివరాత్రి వరకు గంగ, యమున, సరస్వ తి నదుల త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా జరగనుంది. కుంభమేళాలో మొదట నాగ సాధువులు స్నానం చేసి.. ఆత్మ శుద్ధి, తపస్సు లేకుండా ఎవరూ నిజమైన పుణ్యాన్ని పొందలేదని భక్తులకు ఒక సంకేతం ఇస్తారు. దేశం నలుమూలల నుండి యాత్రికులు గంగా, యమునా మరియు పౌరాణిక సరస్వతి నది సంగమం అయిన త్రివేణి సంగమం వద్ద స్నానాలు చేస్తారు. ఈ నెల 13న పౌష్ పూర్ణిమ స్నానంతో ప్రారంభమయ్యే మహాకుంభ మేళా..ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.

Mahakumbh Mela 2025 Important Bathing Dates history and significance

పవిత్ర స్నానాలు
కుంభేమళాలో పవిత్ర స్నానాల ముహూర్తాలు ఖరారు చేసారు. 13న ప్రారంభం రోజు తరువాత 14న మొదటి షాహి స్నాన్ నిర్వహిస్తారు. జనవరి 29న రెండవ షాహి స్నాన్ మౌని అమావాస్య రోజు కావటంతో ఈ రోజున ముహూర్తం ఫిక్స్ చేసారు. ఫిబ్రవరి 3న బసంత్ పంచమి రోజున మూడవ షాహి స్నాన్ ఆచరించాలని సూచిస్తున్నారు. అదే విధంగా ఫిబ్రవరి 12న మాఘి పూర్ణిమ, ఫిబ్రవరి 26 మహా శివరాత్రి కావటంతో ఈ ఆరు రోజులు మహాకుంభ మేళా లో స్నానాలు చేసేందుకు మంచి సమయంగా చెబుతారు. ఈ సమయంలోనే కుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు ప్రపంచ వ్యాప్తంగా తరలి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Mahakumbh Mela 2025 Important Bathing Dates history and significance

సర్వం సిద్దం
కుంభమేళా ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిని లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కుంభమేళా కోసం ప్రత్యేకంగా విమాన, రైలు సర్వీసులను ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 13 వేల ప్రత్యేక రైళ్లను పలు ప్రాంతాల నుంచి నడుపుతున్నారు. ఇక, ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి రద్దీకి అనుగుణంగా రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో, కోట్లాది మంది భక్తులు పాల్గొనే ఈ కుంభమేళా లో ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి చేసేందుకు భద్రత..సౌకర్యాలు పైన యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+