ఉద్ధవ్‌తో కలుస్తా, మేం ఒక్కటవుతాం: రాజ్ సంచలనం
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత అవసరమైతే శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ థాకరేతో చేతులు కలపడానికి తాము సిద్ధమని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ థాకరే బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులను బట్టి తాము కూటమి కట్టే వీలుందని బుధవారం ఆయన ఓ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ వెల్లడించారు.
అలాంటప్పుడు వారిద్దరూ ఒకే వేదిక పైకి రాకపోవడానికి కారణమేమిటన్న ప్రశ్నకు... మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు, అభివృద్ధి కోసం అవసరమైతే మా సోదరులిద్దరం ఒక్కటవుతామని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠ, పట్టుదల కన్నా రాష్ట్రమే తనకు అత్యంత ముఖ్యమన్నారు.

ఈ విషయంలో ఇతరులు బాధపడాల్సిందేమీ లేదని, జోక్యం చేసుకునే అవసరం అసలే లేదన్నారు. కాగా, బీజేపీ - శివసేన పాతికేళ్ల కూటమి విచ్ఛిన్నమైన నేపథ్యంలో శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన.. రెండూ చేరువ కావచ్చునని రాజకీయ విశ్లేషకులూ భావిస్తున్నారు. సోదరులిద్దరూ ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శలు చేస్తుండటం గమనార్హం.
టీవీ ఛానల్ ప్రతినిధితో మాట్లాడిన రాజ్ థాకరే.. మహారాష్ట్రలో బీజేపీకి మెజార్టీ వస్తుందన్న వార్తలను కొట్టి పారేశారు. ఉద్ధవ్ థాకరేతో తనకు ఫోన్ చేసినట్లుగా వస్తున్న ఊహాగానాలను కొట్టి పారేశారు. తనకు అనారోగ్యంగా ఉన్న సమయంలో మాత్రం ఫోన్ చేశాడని చెప్పారు.












Click it and Unblock the Notifications