వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్: పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించిన షిండే సర్కారు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర ప్రజలకు ఏక్‌నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గురువారం ఇంధనంపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. పెట్రోలుపై రూ.5, డీజిల్‌పై లీటరుకు రూ.3 చొప్పున (వ్యాట్) తగ్గించాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కోరారు. వ్యాట్ తగ్గింపు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.6,000 కోట్ల వరకు భారం పడుతుంది.

ప్రజల సంక్షేమానికి శివసేన-బీజేపీ ప్రభుత్వ నిబద్ధతలో భాగమే ఈ నిర్ణయం అని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ. 6,000 కోట్ల భారం పడుతుందని మంత్రాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం షిండే మీడియాకు తెలిపారు. వ్యాట్ తగ్గింపునకు ముందు, ముంబైలో పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 111.35 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ. 97.28/లీటర్.

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత, ముంబైలో పెట్రోల్ కొత్త ధర రూ. 106.36, లీటర్ డీజిల్‌ను రూ. 94.28 చొప్పున కొనుగోలు చేయవచ్చు.కాగా, గత వారం మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసం సమీపంలో గుండెపోటుతో మరణించిన శివసైనికుడి కుటుంబానికి షిండే రూ.3 లక్షల సాయం ప్రకటించారు.

Maharashtra CM Eknath Shinde Reduces VAT On Petrol And Diesel

జూలై 6వ తేదీన, సేన కార్యకర్త భగవాన్ కాలే (55) ఇతర పార్టీ కార్యకర్తలతో కలిసి ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని థాకరే నివాసం 'మాతోశ్రీ'కి వెళ్లి ఆయనకు మద్దతు ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. కాలేకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

విషయం తెలుసుకున్న సీఎం షిండే ఆయన కుటుంబానికి మూడు లక్షల రూపాయల సాయం ప్రకటించారని షిండే కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే పాండురంగ్ బరోరా, సేన థానే రూరల్ సెక్రటరీ సాయినాథ్ తారే మొత్తం సొమ్ములో లక్ష రూపాయలను కాలే కుటుంబానికి అందజేసినట్లు సమాచారం.

English summary
Maharashtra CM Eknath Shinde Reduces VAT On Petrol And Diesel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X