వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీకి ఠాక్రే అనూహ్య అభ్యర్థన -కరోనాను ప్రకృతి విపత్తుగా గుర్తించాలి -ప్రజల్ని ఆదుకోడానికి అదొక్కటే దారి

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా కొనసాగుతున్నది. గురువారం నాటి కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ ప్రకారం, నిన్న ఒక్కరోజే కొత్తగా 2,00,739 కేసులు, 1,037మరణాలు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తికి ఎపిసెంటర్ గా ఉన్న మహారాష్ట్రలోనైతే ఏకంగా 58,952 కొత్త కేసులు, దేశరాజధాని ఢిల్లీలో 17,282 కొత్త కేసులు నమోదయ్యాయి. రెండో దశలో మళ్లీ లాక్ డౌన్ తప్పదనే భయాలతో వలస కూలీలు సొంత ఊళ్లకు పయనమవుతుండటం, ఆంక్షల దెబ్బకు పేదల జీవితాలు మళ్లీ ప్రశ్నార్థకంగా మారడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో..

Recommended Video

COVID-19 : Uddhav Thackeray Urges Centre To Consider COVID-19 As Natural Calamity || Oneindia Telugu

శభాష్ అచ్చెన్న! -17న వైసీపీలో చేరికా? -విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు-జగన్ పెట్టుబడి రహస్యం ఇదేశభాష్ అచ్చెన్న! -17న వైసీపీలో చేరికా? -విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు-జగన్ పెట్టుబడి రహస్యం ఇదే

కరోనా మహమ్మారి విలయం ధాటికి గతేడాది అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలగా, ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న భారత్ ను సెకండ్ వేవ్ పట్టి పీడిస్తున్నది. గడిచిన రెండు వారాలుగా పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూలు విధించడం, వ్యాపార, వాణిజ్యాలపై ఆంక్షలు విధించడంతో వలస కూలీలు, పేదలు, వీధి వ్యాపారుల పరిస్థితి డోలాయమానంగా తయారైంది. గతంలో మాదిరిగా వాళ్లను గాలికి వదిలేకుండా కొంతలో కొంతైనా సహాయం చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల ప్రకటించారు. అయితే పేదలకు నేరుగా సహాయం చేయడానికి అడ్డంకిగా ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ, కీలకమైన అభ్యర్థనతో కేంద్రానికి ఆయన లేఖ రాశారు. అందులో..

 Maharashtra CM Uddhav Thackeray urges Centre to consider Covid-19 as natural calamity

కరోనా వైరస్ మహమ్మారిని ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అభ్యర్థించారు. కొవిడ్ విలయం వల్ల దెబ్బతిన్న లేదా నష్టపోయిన పేదలకు త్వరితగతిన సాయం అందించడానికి ఇదొక్కటే మార్గమని కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.కేంద్రం గనుక కరోనాను ప్రకృతి విపత్తుగా గుర్తించినట్లయితే, విపత్తు నిర్వహణ చట్టాల్లో మార్పులకు అవకాశం ఏర్పడుతుందని, విపత్తు నిధులతో పేదలకు సహాయం అందించగలని ఠాక్రే పేర్కొన్నారు.

అంబేద్కర్‌పై సీజేఐ అనూహ్య క్లెయిమ్ -సంస్కృతం అధికార భాషగా ప్రతిపాదన చేశారన్న జస్టిస్ బోబ్డేఅంబేద్కర్‌పై సీజేఐ అనూహ్య క్లెయిమ్ -సంస్కృతం అధికార భాషగా ప్రతిపాదన చేశారన్న జస్టిస్ బోబ్డే

ప్రస్తుతం మన దేశంలో తుపానులు, వరదలు, పిడుగుపాట్లు వంటి వాటినే ప్రకృతి విపత్తుగా పరిగణించడం, అవి సంభవించిన సమయంలో హుటాహుటిన సహాయకార్యక్రమాల కింద నిధుల విడుదల, పంపిణీని వేగంగా అమలు చేస్తుండటం తెలిసిందే. అయితే, కరోనాను కూడా ప్రకృతి విపత్తుగా గుర్తించినట్లయితే పేదకు సాహాయం మరింత వేగంగా అందుతుందని మహారాష్ట్ర సీఎం అన్నారు. ''కేంద్ర విపత్తు నిర్వహణ చట్టంలో భాగంగా అన్ని రాష్ట్రాల విపత్తు నిర్వహణ చట్టాలు ఏర్పడ్డాయి. అందువల్ల కరోనా బాధిత ప్రజలకు సహాయం చేయడానికి రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధిని వినియోగించలేకపోతున్నాం. విపత్తు నిధులను సమర్థవంతంగా వాడుకునేలా కేంద్రం.. కరోనాను విపత్తుగా గుర్తించాలి. దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం'' అని మహారాష్ట్ర సీఎం తన లేఖలో పేర్కొన్నారు.

English summary
Maharashtra Chief Minister Uddhav Thackeray has written a letter to the Centre, urging to consider the COVID-19 pandemic as natural calamity, so that the government can use the state disaster response fund (SDRF) to provide financial assistance to the affected people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X