వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర సీఎం సతీమణీకి కరోనా వైరస్.. సెల్ప్ ఐసోలేషన్‌లో రష్మీ ఠాక్రే

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో అధికంగా కరోనా కేసులు వస్తున్నాయి. సీఎం ఉద్దవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నారు. సీఎం అధికార నివాసంలో ఆమె ఉన్నారు. ఇటు మహారాష్ట్రలో మంగళవారం 28,699 కొత్తగా కరోనా కేసులు వచ్చాయి. గత 24గంటల్లో రాష్ట్రంలో 132 కరోనా మరణాలు వచ్చాయని అధికారులు తెలిపారు.

పర్బని జిల్లాలో ఈ నెల 24 నుంచి 31 వరకూ లాక్‌డౌన్‌ విధించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ దీపక్‌ ముగలికర్‌ స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో ప్రజలను బయటకు అనుమతించకున్నా.. కరోనా కేసులు వస్తున్న క్రమంలో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించామని చెప్పారు. ఈ నెల 24న రాత్రి ఏడు గంటల నుంచి వర్తించే లాక్‌డౌన్‌ 31 వరకూ కఠినంగా అమలవుతుందని అన్నారు.

maharashtra cm wife infected corona virus

Recommended Video

Covid-19 : Union Health Minister Harsh Vardhan On 'Second Peak' Of Covid-19 || Oneindia Telugu

కరోనా కేసులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు. వైరస్ కేసులు ఇలాగే పెరిగితే ప్రజలు కోవిడ్ 19 నిబంధనలు పాటించకుంటే పలు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించే ఆలోచనలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఉన్నారని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్‌ తోపే ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. సంపూర్ణ లాక్‌డౌన్‌తో ఫలితం ఉండదని వైరస్‌ వ్యాప్తిని ఇది అడ్డుకోలేదని మహారాష్ట్ర కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌లో కొందరు సభ్యులు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు.

English summary
maharashtra cm uddhav thackeray wife rashmi thackeray infected corona virus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X