వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలో కరోనా: భారీ తగ్గుదల -కొత్తగా 48,700 కేసులు, 524 మ‌ర‌ణాలు -ఆక్సిజన్ లేక మరో నలుగురు మృతి

|
Google Oneindia TeluguNews

తోలి వేవ్ లాగే ప్రస్తుత రెండో దశ వ్యాప్తిలోనూ కరోనా మహమ్మారి దెబ్బకు విలవిల్లాడుతోన్న మహారాష్ట్రలో పరిస్థితి కాస్త నిదానించినట్లు, వైరస్ వ్యాప్తి స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఒక్కరోజు కేసులు తగ్గినంతమాత్రాన దీన్ని ఉపశమనంగా భావించాల్సిన అవసరంలేదనే వాదన వినిపిస్తోంది..

వ్యాక్సిన్ ధరలను తగ్గించండి ప్లీజ్ -సీరం, భారత్ బయోటెక్‌కు మోదీ సర్కార్ విన్నపం -మాట వింటారా?వ్యాక్సిన్ ధరలను తగ్గించండి ప్లీజ్ -సీరం, భారత్ బయోటెక్‌కు మోదీ సర్కార్ విన్నపం -మాట వింటారా?

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వ్యాప్తి కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన లెక్కల ప్రకారం, గడిచిన 24 గంటల్లో కొత్తగా 48,700 పాజిటివ్ కేసులు, 524 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 43,43,727కు, మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 65,284కు పెరిగింది.

Maharashtra covid: 48,700 new cases, 524 deaths in 24 hrs, 4 died in Thane oxygen shortage

మహారాష్ట్రలో గడిచిన 24 గంట‌ల్లో 71,736 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 36,01,796కు చేరిన‌ట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 6,74,770 యాక్టివ్ క‌రోనా కేసులు ఉన్న‌ట్లు పేర్కొంది. కాగా దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర తొలి స్థానంలో కొన‌సాగుతున్న‌ది. ఇదిలా ఉంటే,

జస్టిస్ రమణకే షాకిచ్చారు -వారిపై పోలీసులకు సీజేఐ ఫిర్యాదు -సుప్రీంకోర్టు పరిశీలనలో కీలక అంశాలుజస్టిస్ రమణకే షాకిచ్చారు -వారిపై పోలీసులకు సీజేఐ ఫిర్యాదు -సుప్రీంకోర్టు పరిశీలనలో కీలక అంశాలు

Recommended Video

India Records 3.46 Lakh New Cases In 24 Hours | Oneindia Telugu

మహారాష్ట్రలోని థానేలో వేదాంత ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా సోమవారం మరో నలుగురు కరోనా రోగులు మృతి చెందారు. కరోనా మహమ్మారి బారినపడి ఆస్పత్రుల్లో చేరితే, ఆక్సిజన్ లేని కారణంగా జనం చనిపోతుండటం మరింత విషాదకరంగా మారింది. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఇవాళ దేశంలో కొత్తగా 3,52,991 కొత్త కేసులు నమోదయ్యాయి.

English summary
Maharashtra on Monday saw a sharp drop in daily Covid-19 cases with 48,700 fresh infections. The fresh cases reported on Monday have taken state's tally of active cases to 6,74,770. According to the state government data, Maharashtra also recorded 524 coronavirus-related deaths in the last 24 hours. Four Covid-19 patients die at Thane hospital due to oxygen shortage
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X